ఐపిఎల్ 5 ప్రారంభ ఉత్సవంలో సూపర్ స్టార్
ఏప్రిల్ 3న చెన్నైలో జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐదవ సీజన్ ప్రారంభ ఉత్సవంలో బాలీవుడ్ సూపర్ స్టార్ ఆతిథ్యం ఇవ్వనున్నారు. 69 సంవత్సరాల వయసు కలిగిన ఈ సూపర్ స్టార్ ఇటీవల జరిగిన ఉదర శస్త్ర చికిత్సల నుండి పూర్తిగా కోలుకోని ఐపిఎల్ ఆతిధ్య ఈవెంట్ కోసం ప్రత్యేకంగా సన్నధ్దం అవుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా అమితాబ్ తన ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలియజేశారు.
అమితాబ్ తన ట్విట్టర్‌లో ఏప్రిల్ 3న ఐపిఎల్ ఓపెనింగ్ డే.. దాని కోసం సన్నద్దంగా ఉన్నానని ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. అమితాబ్ వాయిస్ పెట్టింది పేరు. తాను హోస్ట్‌గా నిర్వహించిన గేమ్ షో 'కౌన్ బనేగా క్రోర్‌పతి' ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో అందరికి తెలిసిందే.


Click it and Unblock the Notifications











