Beast దెబ్బకు ఆ లక్కీ ఛాన్స్ మిస్ చేసుకున్న దర్శకుడు.. హ్యాండ్ ఇచ్చిన స్టార్ హీరో?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన బీస్ట్ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాలతో తెలుగు తమిళంలో ఒకేసారి భారీ స్థాయిలో విడుదలైన ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ మొదటి రోజే ఈ సినిమాకు నెగిటివ్ టాక్ ఎక్కువగా రావడంతో కలెక్షన్స్ ఒక్కసారిగా తగ్గిపోయాయి. కనీసం సినిమాకు యావరేజ్ టాక్ కూడా రాకపోవడం విశేషం. కొలమావు కోకిల, డాక్టర్ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు అందుకున్న దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ రేంజ్ లో డిసప్పాయింట్ చేస్తాడు అని ఎవరూ ఊహించలేకపోయారు. గత కొన్నేళ్లుగా విజయ్ ఎలాంటి సినిమా చేసినా కూడా మినిమమ్ గ్యారెంటీగా సక్సెస్ చూస్తున్నాడు.

ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అయితే అందుకుంటూ వచ్చాయి. కానీ బీస్ట్ సినిమా మాత్రం విజయ్ వరుస విజయాలకు సడన్ బ్రేక్ వేసినట్లయింది. తెలుగులో విజయ్ కు ఇప్పుడిప్పుడే మార్కెట్ పెరుగుతున్న కరెక్టు సమయంలోనే ఈ సినిమా ఒక్కసారిగా ఆ క్రేజ్ను డౌన్ అయ్యేలా చేసింది. తమిళంలో అయితే రెండవ రోజు నుంచి కలెక్షన్స్ తగ్గుతూ వచ్చాయి. ఇక తెలుగులో పెట్టిన పెట్టుబడిని వెనక్కి తెస్తుందా లేదా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. మొత్తంగా బీస్ట్ సినిమా అయితే డిస్ట్రిబ్యూటర్ల ను దారుణంగా దెబ్బ కొట్టింది. ఇక ఈ సినిమా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ పై విజయ్ తండ్రి చంద్రశేఖర్ కూడా నెగిటివ్ కామెంట్ చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. సినిమాను దర్శకుడు అంచనాలకు తగ్గట్లుగా తెరపైకి తీసుకు రాలేకపోయాడు అని.. తీవ్రంగా నిరాశపరిచింది అనికూడా ఆయన వివరణ ఇవ్వడం విశేషం.

 Big doubts on Nelson dilipkumar rajinikanth project

దర్శకుడు నెల్సన్ మాత్రం సినిమాకు నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది అని ప్రమోషన్స్ కొనసాగించాడు. ఇక అతను తన తదుపరి సినిమాను రజినీకాంత్ చేయబోతున్న విషయం తెలిసిందే. బీస్ట్ సినిమాకు పెరిగిన బజ్ తోనే అతనికి రజనీకాంత్ మంచి అవకాశం ఇచ్చాడు. బీస్ట్ విడుదలకు ముందే ఎనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. అనిరుద్ సంగీత దర్శకుడిగా కూడా ఫిక్స్ అయ్యాడు. ఇక ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ కూడా రజనీకాంత్ సినిమాను భారీ బడ్జెట్తో తెరకెక్కించేందుకు ముందుగానే ప్రణాళికను కూడా సిద్ధం చేసుకుంది.

అయితే బీస్ట్ సినిమాకు వచ్చిన రిజల్ట్ తో రజనీకాంత్ నెల్సన్ తో సినిమా చేసే అవకాశం ఉండకపోవచ్చు అని కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో మరొక కొత్త టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం రజనీకాంత్ కూడా వరుస పరాజయాలతో సతమతమవుతున్నాడు. ఇక బీస్ట్ సినిమాతో తీవ్రంగా నిరాశపరిచిన దిలీప్ కుమార్ తో సినిమా అంటే అటు తమిళ ప్రేక్షకులతో పాటు తెనుగు ప్రేక్షకులు కూడా పెద్దగా ఆసక్తి చూపించకపోవచ్చు. రజనీకాంత్ బిజినెస్ కూడా గతంలో కంటే చాలా తగ్గిపోయింది. కాబట్టి ఈ దర్శకుడు తో సినిమా చేయడం రిస్కుతో కూడుకున్న పని. అందుకే నిర్మాతలు కూడా వెనకడుగు వేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X