పెద్ద హీరోలకు నిద్రలేకుండా చేసిన శ్రియా

By Staff


తమిళ కామెడీ నటుడు వడివేల్ ఇపుడు హీరో అయ్యాడు. ఇప్పటికే ఆయన నటించిన హింసించే రాజు పులకేసి సినిమా ఘనవిజయం సాధించింది. ఆయనే హీరోగా మరో సినిమా రూపొందుతోంది. ఈ సినిమా పేరు ఇందిరలోగథిల్ న అజగప్పన్. ఇందులో మూడు విభిన్న పాత్రలను పోషిస్తున్నాడు. ఈ సినిమా కోసమే శ్రియా ఐటమ్ సాంగ్ చేసింది. ఈ సినిమా ఆడియో విడుదల సందర్భంగా వడివేలు మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడాడు. శ్రియా తనతో ఐటమ్ సాంగ్ చేయడం కొందరు హీరోలు జీర్ణించుకోలేక పోయారన్నాడు. ఆ హీరోలెవరంటే...నేను సినిమా ఫీల్డ్ లో కొనసాగడం ఇష్టంలేదా..వారి పేర్లు చెబితే నా నిజ జీవితం కూడా కామెడీ అయిపోతుంది...నేను జ్యోక్ చేయడం లేదు..శ్రియా ఐటమ్ సాంగ్ వార్త బయటకు వచ్చిన తరువాత చాలా మంది ఒకరికి ఒకరు ఫోన్లు చేసుకొని ఈ విషయం చర్చించుకున్నారని తెలిసింది...వడివేలు సినిమాలో శ్రియా ఐటమ్ సాంగ్ చేయడమేమిటని ఆ వార్తను ఎవరూ నమ్మలేదు...చాలామంది పెద్ద హీరోలు ఈ వార్త విన్న తరువాత నిద్రకు దూరమయ్యారు...శ్రియా నాతో ఐటమ్ సాంగ్ చేసిందన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు...అన్నాడు.

సూపర్ స్టార్ రజనీకాంత్ తో శివాజీ సినిమా చేసిన శ్రియా మీ సినిమాలో ఐటమ్ సాంగ్ కు ఎలా ఒప్పుకుందని అడిగితే....దీని వెనకాల చాలా పెద్ద కథే ఉంది బ్రదర్...అన్నాడు..సినిమా నిర్మాత మణిక్కమ్ నారాయణ శ్రియాను సంప్రదించినపుడు నన్ను కూడా తీసుకువెళ్లాడు...ఎలాంటి కండీషన్లు లేకుండా శ్రియా ఒప్పుకుంది...ఇందుకోసం నారాయణ పెద్ద మొత్తం చెల్లించాడు..అది వేరే విషయం...ఏదేమైనా మా సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడానికి శ్రియా తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది...అన్నాడు.

మీతో ఐటమ్ సాంగ్ చేసిన తరువాత శ్రియా చాలా పెద్ద అవకాశాలు కోల్పోయింది..ఈ విషయం మీకు తెలుసా వడివేలు గారూ..అంటే...అవును... కానీ ఆమె నా హీరోయిన్ గా చేయలేదనే విషయాన్ని గుర్తెరగాలి....ఆమె కామెడీ సాంగ్ లో నాతో పాటు డాన్స్ చేసిందంతే...అదేం రొమాన్స్ పాట కూడా కాదు..నాలుగున్నర నిమిషాల పాట అంతే...నగేష్ హీరోగా రూపొందిన సర్వర్ సుందరం సినిమాలో కె.ఆర్.విజయ కనిపించిన విషయాన్ని ఇపుడు గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎమ్.జి.ఆర్, శివాజీ గణేషన్ లాంటి అగ్రహీరోల సరసన నటించిన విజయ నగేష్ సినిమాలో కనిపించింది. అదీ ఒక లవర్ గా. ఈ విషయంపై ఎమ్.జి.ఆర్ ఎప్పుడూ కామెంట్ చేయలేదు..పైగా తన సినిమాలలో నటించే అవకాశాన్ని విజయకు కల్పించాడు....అన్నాడు వడిలేలు.

ఇంతకు మీతో డాన్స్ చేసినందుకు శ్రియా ఎలా ఫీలయింది..అంటే...అమె పక్కా ప్రొఫెషనల్...నాతో డాన్స్ చేయాలని ఆమె నిర్ణయం తీసుకున్నప్పుడు ఆమెకు నా కామెడీ ఎంటే ఎంతో ఇష్టమని చెప్పింది..ఆమెకు నేను అభిమాన నటుడినట...వడివేలు సర్, మీతో కలిసి నటించే అవకాశం రావడం నాకు చాలా సంతోషంగా ఉంది..అంది...ఈ విషయాన్ని బట్టే చెప్పవచ్చు ఆమె సహృదయత కల నటో...మూడ నమ్మకాల ఆధారంగా నడిచే ఈ సినిమా ఫీల్డ్ లో ఉన్న ఆమెకు ఇంతటి సహృదయత ఉన్నదంటే ఆమెను కొనియాడకుండా ఉండలేకుండా ఉన్నానని వడివేలు ముగించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X