సౌత్ లో అది పెద్ద మల్టి స్టారర్ ఫిల్మ్
దర్శకుడు శంకర్ ఏది చేసినా బారీగానే చేస్తారు. తాజాగా రజనీకాంత్, కమల్ హాసన్ కాంబినేషన్ లో ఓ స్టోరీ లైన్ తీసుకుని వీరిద్దరిని కలిసి ప్రపోజల్ పెట్టారని చెన్నై సమాచారం. అయితే వీరిద్దరూ కొంత టైమ్ అడిగారని,అలాగే వీరిద్దరినీ భరించి..ఇంత పెద్ద మల్టి స్టారర్ చిత్రం నిర్మించే నిర్మాత ఎవరు అనేది ఓ పెద్ద పక్రియ అని చెప్తున్నారు. కానీ ఈ కాంబినేషన్ సినిమా కనుక అయితే ఈ మధ్య కాలంలో వచ్చే అతి పెద్ద మల్టి స్టారర్ చిత్రం అవుతుందని అంటున్నారు. ఇక తెలుగులో ప్రస్తుతం రామ్ చరణ్, అల్లు అర్జున్ లతో వంశీ పైడిపల్లి ఓ చిత్రం చేస్తున్నారు. అలాగే మహేష్ బాబు,వెంకటేష్ లతో దిల్ రాజు ఓ మల్టి స్టారర్ చిత్రం ప్లాన్ చేసారు. దాని పేరు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.
గతంలో కమల్,రజనీలతో కలిసి కొన్ని చిత్రాలలో నటించారు. కానీ ఇద్దరూ స్టార్స్ గా ఎదిగి ఎవరికి వారే ప్రత్యేకమైన మార్కెట్స్ ఏర్పాటు చేసుకున్న తర్వాత మాత్రం కలిసి నటించలేదు. దాంతో ఈ చిత్రంపై మంచి క్రేజ్ వస్తోంది. ఇక ప్రస్తుతం శంకర్ చిత్రం త్రీ రాస్కేల్స్ విడుదలకు సిద్దమైంది. ఇలియానా హీరోయిన్ గా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న త్రి ఇడియట్స్ రీమేక్.. త్రీ రాస్కేల్స్ విడుదల రైట్స్ ని దిల్ రాజు తీసుకున్నారు. ఈ చిత్రం సంక్రాంతి అనంతరం అంటే జనవరి 26,2012న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని తమిళంలో 'నాన్బన్' టైటిల్ తో విడుదల చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











