పవన్ కల్యాణ్ హీరోయిన్‌కు షాక్.. భాషను బూచిగా చూపి సాగనంపారు!
తెలుగుతోపాటు తమిళ బిగ్‌బాస్ చాలా హుషారుగా సాగుతున్నది. ఆదివారం జరిగిన ఎలిమినేషన్ రౌండ్‌లో టాప్ కంటెస్టెంట్ ముంతాజ్ అవుట్ కావడం అభిమానులను షాక్ గురిచేసింది. ఇంటి నుంచి నిష్క్రమించే సమయంలో ముంతాజ్ వ్యవహరించిన తీరుపై అభిమానులు, టీవీ ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపించారు. పెద్దగా పట్టించుకోవడానికి వీలు లేని కారణంగా ముంతాజ్ బిగ్‌బాస్ నుంచి బయటకు వెల్లడం ప్రేక్షకులకు జీర్ణించుకోలేకపోయారు. ఇంతకు ఏం జరిగిందంటే..

చిన్న వివాదంలో ముంతాజ్
తమిళ బిగ్‌బాస్ హౌస్‌లో రుత్విక అనే కంటెస్టెంట్‌కు ముంతాజ్‌కు చిన్న గొడవ జరిగడంతో ఆమె నామినేట్ అయింది. రుత్వికకు సహాయం చేయడానికి ముంతాజ్ నిరాకరించడంతో కొంత వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. దాంతో ఇంటి సభ్యులతోపాటు ప్రేక్షకులు ప్రతికూలంగా స్పందించి ఆమెను బయటకు పంపారనే మాట బలంగా వినిపించింది.

కమల్ హాసన్ సలహాలు
ఆదివారం ఎలిమినేషన్ రౌండ్‌ను హోస్ట్ కమల్ ప్రారంభించాడు. ఇంటిలో పరిస్థితులను సరిగా అర్ధం చేసుకోవాలని సూచించాడు. ఇక ఎలిమినేషన్‌లో ఉన్న విజయలక్ష్మి, ముంతాజ్‌లలో ఒకరిని ఇంటి నుంచి పంపాల్సి వచ్చింది. ఆ క్షణంలో విజయలక్ష్మి అనే ఇంటి సభ్యురాలు సేఫ్ అని చెప్పడంతో ముంతాజ్ బయటకు వెళ్లాల్సి వచ్చింది.

చిరునవ్వుతో ముంతాజ్ బయటకు
ఇంటి నుంచి బయటకు వెళ్లాలని చెప్పడాన్ని ముంతాజ్ చాలా తేలికగా తీసుకొన్నారు. చిరునవ్వుతో బయటకు వెళ్తున్న తన క్లోజ్ ఫ్రెండ్ యషికా కన్నీటి పర్యంతమైంది. పొంగుకొస్తున్న దు:ఖాన్ని ఆపుకోలేకపోయింది. దాంతో ముంతాజ్ ఆమెను ఓదార్చాల్సి వచ్చింది. ముంతాజ్ వ్యవహరించిన తీరుకు అభిమానులు సోషల్ మీడియాలో ఐ లవ్ యూ అంటూ సందేశాల పంపారు.

తమిళుడికే బిగ్‌బాస్ టైటిల్
గతవారం రుత్వికకు సహకరించకపోవడం వల్లనే ప్రేక్షకులు ప్రతికూలంగా స్పందించి ఉంటారేమో. అలాగే కాకుండా ఈ సారి తమిళుడే బిగ్‌బాస్ టైటిల్ సొంతం చేసుకోవాలని భావిస్తున్నారని ఇంటి సభ్యులకు చురక అంటించింది. వేదికపైన ఉన్న తన కుటుంబ సభ్యులను ముంతాజ్ కలుసుకొని ఉద్వేగానికి లోనైంది.

పవన్‌తో ఖుషీలో
ముంతాజ్ తమిళ పరిశ్రమలో మంచి గుర్తింపు ఉన్న నటి. ఖుషీలో పవన్ కల్యాణ్ సరసన ఓ కీలక పాత్రలో కనిపించింది. ఆమె పోషించిన పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్సాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. పవన్, ముంతాజ్‌పై చిత్రీకరించిన పాట ప్రజాదరణ పొందింది.


Click it and Unblock the Notifications











