twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బస్సుల్లో మహిళలను వేధించిన బిగ్ బాస్ కంటెస్టెంట్, భగ్గుమంటున్న నెటిజన్లు!

    |

    బిగ్ బాస్ 3 తమిళ్ రియాలిటీ షోలో కంటెస్టెంటుగా ఉన్న నటుడు శరవణన్ వివాదంలో ఇరుక్కున్నాడు. తాను కాలేజీ రోజుల్లో బస్సుల్లో ప్రయాణించే సమయంలో మహిళలను తాకకూడని చోట తాకుతూ ఆనందపడే వాడిని అని తెలిపారు. అతడి వ్యాఖ్యలపై నెటిజన్లు మండి పడుతున్నారు.

    శనివారం రాత్రి ప్రసారమైన తమిళ బిగ్ బాస్ షోలో భాగంగా ఓ సందర్భంలో కమల్ హాసన్... సిటీ బస్సుల్లో ట్రావెలింగ్ ఎంత కష్టమో వెల్లడించారు. 'సిటీ బస్సుల్లో ప్రయాణించడం చాలా కష్టం. సమయానికి ఆఫీసుకు చేరడానికి చాలా కష్టాలు చాలా కష్టపడుతుంటారు. ఇదే అదునుగా కొందరు మహిళలను అసభ్యంగా తాక కూడని చోట తాకుతారు' అని వ్యాఖ్యానించారు.

    నేను కూడా అలాంటి పనులు చేశాను

    నేను కూడా అలాంటి పనులు చేశాను

    వెంటనే శరవణన్ కల్పించుకుని... ‘నేను కూడా కాలేజీ రోజుల్లో ఇలాంటివి చేశాను' అంటూ సమాధానం ఇచ్చారు. అప్పట్లో కేవలం మహిళలను ఆట పట్టించడానికి, వారిని టచ్ చేయడానికే బస్సు ఎక్కేవాడిని, నా స్నేహితులతో కలిసి ఇలాంటి పని చేసేవాడిని అంటూ వెల్లడించారు.

    శరవణన్ వ్యాఖ్యలపై నెటిజన్ల ఆగ్రహం

    శరవణన్ వ్యాఖ్యలపై నెటిజన్ల ఆగ్రహం

    శరవణన్ వ్యాఖ్యలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలు ఎదుర్కొంటున్న ఒక తీవ్రమైన సమస్యను ఒక జోక్‌లా బిగ్ బాస్ షోలో చూపించడం, దానికి ఆడియన్స్ చప్పట్లు కొట్టడం విడ్డూరంగా ఉంది అంటూ మండి పడుతున్నారు.

    సింగర్ చిన్మయి స్ట్రాంగ్ రిప్లై

    ఈ వీడియో క్లిప్ షేర్ చేసిన ఓ అభిమాని... దీనిపై స్పందించాలని సింగర్ చిన్మయిని కోరారు. దీనిపై ఆమె వెంటనే రియాక్ట్ అవుతూ... ‘ మహిళలను వేధించడానికే నేను బస్సు ఎక్కేవాడిని అంటూ ఒక వ్యక్తి గర్వంగా చెప్పుకోవడాన్ని టీవీ ఛానల్ ప్రసారం చేయడం, ఇలాంటి ఒక సీరియస్ విషయాన్ని జోక్‍‌లా ప్రజెంట్ చేయడం, దానికి ఆడియన్స్ చప్పట్లు కొడుతూ ఎంజాయ్ చేయడం విచారకరం అంటూ చిన్మయి ఫైర్ అయ్యారు.

    బిగ్ బాస్ షోపై ముదురుతున్న వివాదాలు

    బిగ్ బాస్ అంటేనే వివాదాలకు కేంద్ర బిందువు. అయితే ఇప్పటి వరకు ఇంటి సభ్యుల మధ్య జరిగే గొడవల విషయంలోనే వివాదాలు ఉండేవి. అయితే మహిళలు ఎదుర్కొంటున్న ఒక సీరియస్ ఇష్యూను ఈ విధంగా ప్రజెంట్ చేయడం, అది తప్పు కాదు అనే విధంగా చూపించడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

    English summary
    "A Tamil channel aired a man proudly proclaiming he used the Public Bus Transport system to molest/grope women - to cheers from the audience. And this is a joke. To the audience. To the women clapping. To the molester. Damn." Chinmayi Sripaada tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X