అతడితో కలసి ఆ పని చేస్తే ధైర్యంగా చెప్పేస్తా.. నాకు పెళ్లి అవసరం లేదు.. హీరోయిన్!

తమిళ బిగ్ బాస్ షోతో నటి ఓవియా తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది. ఆమె వ్యక్తిగత జీవితం గురించి తరచుగా ఏదో ఒక పుకారు వినిపిస్తూనే ఉంది. అలాంటివి నిజంగానే చేస్తే ధైరంగా చెప్పేస్తానని ఓవియా క్లారిటీ ఇస్తోంది. ప్రస్తుతం తమిళనాట ఓవియా క్రేజీ సెలెబ్రిటీ. బిగ్ బాస్ షో తర్వాత హీరోయిన్ గా పలు చిత్రాల్లో అవకాశాలు అందుకుంటోంది. నటుడు ఆరవ్ తో ఈ అమ్మడు ప్రేమలో ఉందనే వార్తలు వస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఓవియా మాట్లాడుతో తన రిలేషన్ షిప్ గురించి మాట్లాడింది.

ఇద్దరం కలసి

ఇద్దరం కలసి

రాజా భీమా అనే చిత్రంతో తాను ప్రస్తుతం నటిస్తున్నట్లు ఓవియా తెలిపింది. ఈ చిత్రంలో నేను,ఆరవ్ కలసి ఓ పాటకు డాన్స్ చేశాం. విశేషం ఏంటంటే.. ఆరవ్ స్వయంగా రాసిన పాట అది. నన్ను పొగుడుతూ రాశాడు. ఆరవ్ నాకు మంచి స్నేహితుడు. అతడంటే చాలా ఇష్టం అని ఓవియా తెలిపింది. తామిద్దరం కలసి బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న విషయాన్ని ఓవియా గుర్తు చేసింది.

విభేదాలు నిజమే

విభేదాలు నిజమే

వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, విభేదాలతో విడిపోయారని అనేక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై ఓవియా స్పందిస్తూ.. మేమిద్దరం గోడపడ్డ మాట వాస్తవమే. కానీ ఇప్పుడు మా మధ్య విభేదాలు తొలగిపోయాయి. స్నేహంగా మెలుగుతున్నాం. బయట ఏవైనా కార్యక్రమాలు జరిగితే ఇద్దరం కలిసే వెళతాం అని ఓవియా తెలిపింది.

ధైర్యంగా చెప్పేస్తా

ధైర్యంగా చెప్పేస్తా

మేమిద్దరం స్నేహంగా ఉండడం చూసి ప్రేమలో ఉన్నారు, సహజీవనం చేస్తున్నారు అని ప్రచారం చేస్తున్నారు. కొంతమంది త్వరలో మా ఇద్దరి వివాహం జరగబోతోందని కూడా వార్తలు సృష్టిస్తున్నారు. ఇలాంటి అసత్యాలు ప్రచారం చేయడం సరైనది కాదు. నేను నిజంగానే అతడితో డేటింగ్ చేస్తే ఆ విషయాన్ని ధైర్యంగా బయటకు చెబుతా. నాకు ఎలాంటి మొహమాటం లేదు అని ఓవియా తెలిపింది.

నాకు పెళ్లి అవసరం లేదు

నాకు పెళ్లి అవసరం లేదు

ఆరవ్ నాకు మంచి ఫ్రెండ్ అని మాత్రమే మరోమారు చెబుతున్నా. ఇందులో మార్పు ఉండదు. ఒకరికి ఒకరం సపోర్ట్ గా ఉంటున్నాం. నాకు వివాహ వ్యవస్థపై నమ్మకం లేదు. నాకు అసలు పెళ్లి అనేది అవసరం లేదు. వైవాహిక జీవితం నాకు సెట్ కాదు అని తేల్చేసింది. బిగ్ బాస్ ఓవియాని సెలేబ్రిటిగా మార్చింది. ఈ అమ్మడు ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేస్తూ సొంతంగా పబ్లిసిటీ పొందుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X