నన్ను వాడుకుంటున్నారు.. బిగ్‌బాస్ భామ హాట్ కామెంట్స్.. నయనతారలా కాదు!
అదృష్టం అంటే తమిళ బిగ్ బాస్ భామ ఓవియదే అని చెప్పొచ్చు. తొలి చిత్రం కలవానితో మంచి సక్సెస్ అందుకున్న ఓవియాకు మంచి అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత నటించిన చిత్రాలన్నీ నిరాశపరచడంతో కెరీర్ పూర్తిగా పడిపోయింది. ఆ సమయంలో బిగ్ బాస్ 1లో అవకాశం దక్కించుకుంది. తమిళ బిగ్ బాస్ తో ఓవియాకు మంచి క్రేజ్ వచ్చింది. ఎంతలా అంటే సోషల్ మీడియాలో ప్రతి రోజు ఓవియా తలచుకునే అభిమానులు ఉన్నారు. ఇప్పుడు సినిమామా అవకాశాలు అందుకుంటోంది. తాజాగా ఓవియా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

రాత్రికి రాత్రే కాలేదు
ఓవియా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను స్వతంత్రంగా ఉండాలనుకునే మహిళని. అందుకే సొంతంగా డబ్బు సంపాదించాలని మోడలింగ్ మృతిని ఎంచుకున్నా. నేను రాత్రికి రాత్రే సెలేబ్రిటిగా మారిపోయానని చాలా మంది అనుకుంటున్నారు. అది కొంతవరకు వాస్తవం. కానీ పూర్తిగా కాదు. కెరీర్ ఆరంభంలో నేక ఇబ్బందులు ఎదుర్కొన్నా. దర్శకుడు సద్గుణ నాకు కలవాని చిత్రంలో అవకాశం ఇవ్వడంతో తన జీవితం మారిపోయిందని ఓవియా తెలిపింది.

వాడుకుంటున్నారు
చాలా రోజుల క్రితమే నేను నటిగా పరిచయం అయ్యాను. కానీ అవి చిన్న పాత్రలు కావడంతో గుర్తింపు రాలేదు. బిగ్ బాస్ షో తర్వాత నాకు మంచి గుర్తింపు లభించింది. షో ముగిసి ఏడాది గడుస్తున్నా అభిమానులు నన్నింకా మరచిపోలేదు. ఇది చాలా ఆనందాన్ని కలిగించే విషయం అని ఓవియా తెలిపింది. కానీ నా గుర్తింపుని కొంతమంది ప్రచారం కోసం వాడుకుంటున్నారు. అది చాలా భాదాకలిగిస్తోందని ఓవియా తెలిపింది. చాలా రోజుల క్రితం నేను చేసిన చిన్న పాత్రలని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఇబ్బందికి గురి చేస్తున్నారు.

నయనతారలా కాదు
తాను లేడి ఓరియంటెడ్ చిత్రాలకు సిద్ధం అని ఓవియా తెలిపింది. నయనతార నటించిన కర్తవ్యం లాంటి చిత్రాలైతే నేను చేయను. ఎందుకంటే నేను నేనుగా ఉండాలి. అలాంటి పాత్రలు వస్తే చేస్తా. సందేశాలు ఇవ్వడం ఇష్టం ఉండదు. తాను చేసే చిత్రాలు భిన్నంగా ఉండాలి కానీ సందేశాత్మకంగా ఉండకూడదు అని ఓవియా తెలిపింది.

హిమాలయాలకు
తాను మోడలింగ్ చేసే రోజుల నుంచే సెలవు రోజుల్లో స్నేహితులతో దూరంగా వెళుతుంటా. న్యూ ఇయర్ వేడుకల్ని స్నేహితులంతా కలసి జరుపుకుంటాం. నాకు నచ్చిన ప్రదేశం హిమాలయాలు. ఎక్కువ సెలవులు ఉన్నపుడు హిమాలయాలకు వెళ్ళాలని భావిస్తానని ఓవియా తెలిపింది. ప్రస్తుతం పలు తమిళ చిత్రాలతో బిజీగా గడుపుతోంది.


Click it and Unblock the Notifications











