బిగ్‌బాస్ బ్యూటీ ఓవియాపై కేసు నమోదు.. మోదీపై ట్వీట్‌తో కష్టాల్లోకి!
తమిళ నటి, బిగ్‌బాస్ తమిళం ఫేమ్ ఓవియా హెలెన్ ఇబ్బందుల్లో పడ్డారు. ఆదివారం ప్రధాని నరేంద్రమోదీ తమిళనాడు పర్యటన సందర్భంగా ఓవియా చేసిన ట్వీట్‌పై బీజేపీ రాష్ట్ర విభాగం భగ్గుమన్నది. తమిళ రాజకీయ వర్గాల ప్రకారం ఓవియాపై బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఈ కేసు వివరాల్లోకి వెళితే..
వాలంటైన్ రోజున ప్రియుడితో పెర్లీ ఫుల్ రొమాన్స్.. తన్మయత్వంలో మునిగిన ప్రేమ జంట

మోదీ చెన్నై పర్యటన సందర్భంగా
ఫిబ్రవరి 14వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ చెన్నైలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో యువ నటి ఓవియా ప్రధానిని ఉద్దేశించి #GoBackModi అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై తమిళ బిజేపీ నేతలు ఆగ్రహాం వ్యక్తం చేశారు. చెన్నై సూపరింటెండ్ ఆఫ్ పోలీస్‌కు నేతలు ఫిర్యాదు సమర్పించారు.

ఓవియాపై బీజేపీ కేసు నమోదు?
తమిళ మీడియా కథనాల ప్రకారం.. మోదీకి వ్యతిరేకంగా ఓవియా చేసిన ట్వీట్‌పై సైబర్ సెల్, సీబీ సీఐడీతో విచారణ జరుపించాలని పోలీసు ఉన్నతాధికారులను కోరినట్టు తెలుస్తున్నది. అలాగే ఆమె ట్వీట్ వెనుక ఉద్దేశం ఏమిటి? ఓవియాపై ఎందుకు చర్యలు తీసుకోకూడదనే విషయాన్ని ఫిర్యాదులో ప్రస్తావించినట్టు సమాచారం.
ఫోటోలు: బెంగాలీ భామ బోల్డ్ ఫోటోషూట్ మీరు ఎప్పుడూ చూడని పిక్స్

సెలబ్రిటీల వెనుక విచ్చిన్నకర శక్తులు
యువ హీరోయిన్ ఓవియా చేసిన ట్వీట్‌పై బీజేపీ తమిళనాడు సెక్రెటరీ స్పందించారు. ఓవియా ట్విట్ వెనుక చైనా, శ్రీలంక దేశాలకు చెందిన కొందరు ఉండవచ్చనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. దేశంలో అస్థిరత, శాంతి భద్రతలకు భంగం వాటిల్లేలా కొందరు కుట్ర పన్నుతున్నారు. అందుకోసం ఓవియా లాంటి సెలబ్రిటీలను సోషల్ మీడియాలో ఉపయోగించుకొంటున్నారు అని ఆయన అన్నారు.

ఓవియాపై కేసుపై ఖండన
ఇదిలా ఉండగా, ఓవియాపై కేసు నమోదు చేశారనే వార్తలను బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు, సోషల్ మీడియా హెడ్ నిర్మల్ కుమార్ ఖండించారు. తమిళనాడులోని ఏ సెలబ్రిటీపై కూడా బీజేపీ నేతలు ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు.

ఓవియా హెలెన్ కెరీర్..
ఇక ఓవియా హెలెన్ కెరీర్ విషయానికి వస్తే.. తెలుగులో ఇది నా లవ్ స్టోరి అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. తమిళంలో 90ml, ముని 4, కాంచన 3, కళవాణి 2 చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం రాజా భీమ, బ్లాక్ కాఫీ, సంభవం చిత్రాల్లో నటిస్తున్నది.


Click it and Unblock the Notifications











