twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తే. అందుకే తన్ని తరిమేశా.. పీటర్ నిజస్వరూపం బయటపెట్టిన వనిత విజయ్

    |

    బిగ్‌బాస్ తమిళ్ సెలబ్రిటీ వనితా విజయ్ కుమార్‌కు మూడో పెళ్లి కూడా కలిసి రాలేదు. పీటర్ పాల్ ప్రవర్తన, అలవాట్లతో విసిగిపోయిన వనిత ఆయనను ఇంటి నుంచి తన్ని తరిమివేసింది. తాను ఇష్టపడి పెళ్లి చేసుకొన్న తర్వాత అతడితో తెగతెంపులు ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందనే విషయాన్ని వెల్లడించారు. తాజాగా మీడియాకు ఓ వీడియో విడుదల చేసి.. పీటర్ బాగోతాన్ని, సంచలన విషయాలను బయటపెట్టారు. వనితా విజయ్ కుమార్ చెప్పిన విషయాలు ఇవే..

    Recommended Video

    Vanitha Vijayakumar, Peter Paul Marriage BREAK UP మూడో మొగుడ్ని కూడా తరిమేసిన వనితా విజయ్‌కుమార్
    పీటర్ పాల్‌ను గుడ్డిగా నమ్మి

    పీటర్ పాల్‌ను గుడ్డిగా నమ్మి

    పెళ్లికి ముందు పీటర్ పాల్‌ను గుడ్డిగా నమ్మి మోసపోయాను. అతడి గురించి పెద్దగా ఎంక్వైరీ చేయలేదు. ఆయన ప్రవర్తన తీరును అడిగి తెలుసుకోలేదు. అతడు ఎందుకు ఒంటరిగా ఉంటున్నాడనే విషయంపై నాకు అనుమానం రాలేదు. ముఖ్యంగా అతడు తన భార్యకు విడాకులు ఇచ్చాడా లేదా అనే విషయాన్ని పట్టించుకోలేదు అని వనితా విజయ్ కుమార్ తెలిపారు.

    నా పేరు చెప్పి బయట డబ్బులు వసూలు

    నా పేరు చెప్పి బయట డబ్బులు వసూలు

    పెళ్లి తర్వాత ఫుల్లుగా తాగి బయటకు వెళ్లిపోయేవాడు. బయటకు వెళ్లి తాగుడు కోసం నా స్నేహితులను, సన్నిహితులను డబ్బులు అడిగేవాడని తెలిసింది. చాలా మంది నాకు ఫోన్ చేసి నీ జీవితంలో ఏం జరుగుతున్నది. అతడిని వదలించుకోకపోతే ప్రమాదం ఎదురవుతుంది. జీవితంలో కోలుకోలేని దెబ్బ తింటావని హెచ్చరించారు. దాంతో పలుమార్లు చెప్పి చూశాను. తప్పనిసరి పరిస్థితుల్లో తన్ని తరిమివేశాను అని వనితా విజయ్ కుమార్ పేర్కొన్నారు.

    విపరీతంగా తాగుడు.. రక్తపు వాంతులు

    విపరీతంగా తాగుడు.. రక్తపు వాంతులు

    పెళ్లి చేసుకొన్న పాపానికి పీటర్‌ను మార్చడానికి చాలా ప్రయత్నాలు చేశాను. ఓ వైపు సోషల్ మీడియాలో పోస్టులతో నాపై దాడులు జరుగుతుంటే చాలా తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యాను. ఆయన ఫోన్‌లో ట్రాకర్‌ను పెట్టాను. ఓ రోజు తెల్లవారుజామున 4 గంటలకే లేచి వెళ్లిపోయి తప్పతాగి పడిపోతే ఆయన అసిస్టెంట్ తీసుకొచ్చాడు. వారం రోజులపాటు ఏమీ తినకుండా కంటిన్యూగా తాగుతూనే ఉన్నాడు. దాంతో రక్తపు వాంతులు విపరీతంగా అయ్యాయి అని వనితా విజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.

    విపరీతంగా, ధూమ, మద్యపానం

    విపరీతంగా, ధూమ, మద్యపానం

    పెళ్లి తర్వాత రక్తపు వాంతులు చేసుకొన్నాడనే వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో వనితా క్లారిటీ ఇచ్చారు. వివాహం జరిగిన కొద్ది రోజులకే పీటర్ పాల్‌ ఆరోగ్యం దారుణంగా మారింది. ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా మద్యానికి, ధూమపానానికి బానిస అయ్యాడు. పలుమార్లు హెచ్చరించినా పట్టించుకోలేదు అని వనితా విజయ్ కుమార్ చెప్పారు.

     అందుకే తన్ని తరిమేశాను

    అందుకే తన్ని తరిమేశాను

    పీటర్ పాల్‌ను నేను ఎంతగా ప్రేమించానో, ఇష్టపడ్డానో ఆయనకు తెలుసు. అనారోగ్యానికి గురైనప్పుడు నేను ఎంత కష్టపడ్డానో ఆయన ప్రత్యక్షంగా చూశాడు. అయితే నా ప్రేమను, ఆవేదనను గుర్తించలేకపోయాడు. ఆయనకు నాకంటే మద్యంపైనే మోజు ఎక్కువ. అందుకే పీటర్‌ను తన్ని తరిమివేయాల్సి వచ్చింది అంటూ వనితా విజయ్ కుమార్ వివరణ ఇచ్చారు.

    నాకు మగతోడు, నా బిడ్డలకు అండగా ఉంటాడనుకొంటే.

    నాకు మగతోడు, నా బిడ్డలకు అండగా ఉంటాడనుకొంటే.

    నాకు, నా పిల్లలకు మగతోడు ఉంటారనే విషయంపై మూడో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. కానీ మరోసారి పీటర్ ప్రవర్తనతో నాపై నాకే ఏవగింపు కలిగింది. నా కూతుళ్లకు అండగా ఉంటారనుకొంటే.. నా ఆశలను అడియాశలు చేశారు. మూడో పెళ్లి అవసరమా అని ప్రశ్నిస్తున్న వారికి ఇదే నా సమాధానం అని వనితా విజయ్ కుమార్ ఎమోషనల్ అయ్యారు.

    మొదటి భార్య సంతకం చేస్తే

    మొదటి భార్య సంతకం చేస్తే

    పీటర్ పాల్‌ తన కుటుంబం వద్దకు, మొదటి భార్య వద్దకు వెళితే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఆయనకు సర్జరీ చేయించడానికి రెడీ. ఇప్పటికే 15 లక్షలు ఖర్చు చేశాను. మరింత మెరుగైన వైద్యం చేయిస్తాను. లీగల్‌గా భార్య అయిన ఎలిజబెత్ మెడికల్ పేపర్లపై సంతకం చేయాల్సి ఉంటుంది. ఆమె కనుకు అంగీకరించి సంతకం చేస్తే వైద్యం చేయిస్తాను అని వనితా విజయ్ కుమార్ చెప్పారు.

    English summary
    Bigg Boss fame, Tamil actress Vanitha Vijayakumar take u turn over her third marriage. She rendered apology to Elisabeth Helen over Peter paul's alcholic addiction. She released a video and rendered an apology to Elisabeth Helen that if she had hurt her in any way she is sorry for that.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X