తమిళ బిగ్‌బాస్ 2 విన్నర్‌గా నిలిచిన ‘కబాలి’ మూవీ నటి
బిగ్ బాస్ తెలుగు 2 విజేతగా కౌశల్ నిలిచిన సంగతి తెలిసిందే. దాదాపు 113 రోజుల పాటు జరిగిన ఈ రియాల్టీ షోలో కౌశల్ మండ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొని అత్యధిక ఓట్లు సంపాదించుకున్నాడు. బిగ్ బాస్ టైటిల్‌తో పాటు రూ. 50 లక్షల ఫ్రైజ్ మనీ సొంతం చేసుకున్నాడు.
తెలుగులో మాదిరిగానే తమిళంలో కూడా బిగ్ బాస్ రెండో సీజన్ ఆదివారం ముగిసింది. కమల్ హాసన్ హోస్ట్ చేస్తున్న ఈ షోలో విజేత ఎవరు? అనేది ఆదివారం రాత్రి జరిగిన గ్రాండ్ ఫినాలెలో ప్రకటించారు. ఇతర కంటెస్టెంట్స్ అందరినీ వెనక్కినెట్టి నటి రిత్విక విజతగా నిలిచింది. బిగ్ బాస్ తమిళ్ 2 టైటిల్‌తో పాటు రూ. 50 లక్షల ప్రైజ్ మనీ సొంతం చేసుకుంది. ఐశ్వర్య దత్తా రన్నరప్‌గా నిలించారు.

తమిళ బిగ్‌బాస్ 2 టైటిల్ గెలిచిన అనంతరం రిత్విక మాట్లాడుతూ... మహిళలకు ఆదర్శంగా ఉండాలనేది తన లక్ష్యమని, బిగ్ బాస్ 2 టైటిల్ గెలవడం ఎంతో సంతోషంగా ఉంది అని వెల్లడించారు. తనకు మద్దతు ఇచ్చిన ప్రేక్షకులకు థాంక్స్ చెప్పారు.
రిత్విక తమిళంలో పలు చిత్రాల్లో నటించారు. రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో వచ్చిన 'కబాలి' చిత్రంలో రిత్విక డ్రగ్స్‌కు బానిసైన అమ్మాయి పాత్రలో నటించింది. బిగ్ బాస్2 విజయం తర్వాత తన కెరీర్ మలుపు తిరుగుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











