బిగ్ బాస్ కంటెస్టెంట్‌కు గుడ్ బై చెప్పిన ప్రేయసి.. బయట ఒకరితో లోపల ఇంకొకరితో!
Recommended Video

ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి కాబట్టే జనాలలో బిగ్ బాస్ షోకు ఇంత క్రేజ్ నెలకొని ఉందేమో. ఈ సంఘటన గురించి తెలిస్తే హవ్వ అంటూ ముక్కున వేలేసుకోవాల్సిందే. ఇండియాలో బిగ్ బాస్ షోకు పిచ్చ క్రేజ్ ఏర్పడింది. తమిళంలో కూడా ప్రస్తుతం బిగ్ బాస్ షో జరుగుతోంది. ఇటీవల జరిగిన సంఘటన ప్రేమ జంట విడిపోవడానికి కారణంగా మారింది.

ప్రేమ జంట
తమిళ బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా పాల్గొంటున్న మహత్ బిగ్ బాస్ హౌస్ లో పిచ్చి పని చేయడంతో అతడి వ్యక్తిగత జీవితంలో చిక్కులు ఏర్పడ్డాయి. బిగ్ బాస్ లోకి రాకముందే మహత్ కు ప్రాచి అనే ప్రేయసి ఉంది. వీరిద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు.

హౌస్‌లోకి వెళ్ళాక
కానీ హౌస్ లోకి వెళ్ళాక మహత్ తన వంకర బుద్ది చూపించాడు. హౌస్ లో మరో సభ్యురాలైన యాషికని ప్రేమించడం మొదలు పెట్టాడు. ఇటీవలే యాశికకు లవ్ ప్రపోజ్ చేశాడు కూడా. ఇదంతా బిగ్ బాస్ హౌస్ లోనే జరిగింది. అతడి లవ్ ని యషిక అంగీకరించింది. దీనితో బయట రచ్చ మొదలైంది.

సోషల్ మీడియా
సోషల్ మీడియాలో బిగ్ బాస్ ఆడియన్స్ అంతా ప్రాచికి సానుభూతి వ్యక్తం చేస్తూ పోస్ట్ లు పెట్టారు. నీ ప్రియుడు మరొకరితో సరసాలు ఆడుతున్నాడు అంటూ ప్రాచికి ట్యాగ్ చేశారు.

మనోవేదన
ఈ మొత్తం వ్యవహారం ప్రాచికి వేదన కలిగించింది. మహత్ ని ప్రాచి చాలా సీరియస్ గా లవ్ చేసింది. ప్రియుడు మోసం చేయడం, తన వ్యక్తి గత జీవితం నడిరోడ్డు మీదకు రావడంతో సోషల్ మీడియా వేదికగా తన భాదని బయట పెట్టింది.

బ్రేక్ అప్
ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెడుతూ తాను మహత్ నుంచి బ్రేక్ అప్ అవుతున్నట్లు ప్రకటించింది. మహత్ ని ప్రేమించాను. అతడితో కలసి జీవితం గురించి చాలా కలలు కన్నా. కానీ అతడు యషికాని ప్రేమిస్తున్నాడని విషయం అందరికి తెలిసిపోయింది. అందుకే అతడి నుంచి విడిపోతున్న అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.


Click it and Unblock the Notifications











