twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్‌బాస్ లో అత్మహత్యా ప్రయత్నం చేసినందుకు: నోటీసులిచ్చారు

    బిగ్‌బాస్ పార్టిసిపెంట్ ఓవియా ఆత్మహత్య ప్రయత్నం నేరం కావడంతో శరవణన్ అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ వేశాడు.

    |

    బిగ్‌బాస్ టీవీ షోలో తమిళ నటి ఓవియా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ప్రసారం చేయడంతో, ఇందుకు లసంబంధించి నేరుగా పోలీస్‌స్టేషన్‌కు హాజరవ్వాలని ఓవియాకు పోలీసులు సమన్లు జారీ చేశారు. ఆమె బిగ్ బాస్ షోలో ప్రవర్తించిన తీరుకు పోలీసులు ఆమెను పిలిపించి విచారణను చేయడానికి సిద్ధమయ్యారు. ఆత్మహత్య ప్రయత్నం నేరం కావడంతో శరవణన్ అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ వేశాడు. ఆమె ఒక షోలో సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించిందని అందుకు కారణం బిగ్ బాస్ షోలో ఉన్న నియమాలని పిటిషన్ లో పేర్కొన్నారు.

    ఇంకెందుకు గొడవ

    ఇంకెందుకు గొడవ

    ప్రస్తుతం ఈ వ్యవహారం తమిళ నాట తీవ్ర దుమారాన్ని రేపుతోంది. అయితే ఓవియ కు సంబందించిన వారు ఈ వార్తను కొట్టి పారేస్తున్నారు. ఓవియ ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించుకుంది కదా.. ఇంకెందుకు గొడవ అని మీడియా ముందు వాబోతున్నారు. అంతే కాకుండా ఎదో క్షణికవేశంలో చేసిందని సర్ది చెప్పుకుంటున్నారు.

    Recommended Video

    Bigg Boss Telugu : Kathi Karthika Trolls Katthi Mahesh
    తన రియాల్టీ క్యారెక్టర్‌తో

    తన రియాల్టీ క్యారెక్టర్‌తో

    ఈ షోలో పాల్గొన్న ఓవియా తన రియాల్టీ క్యారెక్టర్‌తో ప్రజలను కట్టి పడేసింది. షోలో పాల్గొన్న వారిలో తలెత్తిన విభేదాలతో ఒంటరైన ఓవియాను స్నేహితుడిగా ఆరవ్‌ ఆదరించారు. దీంతో అతడిపై ప్రేమ పెంచుకున్న ఓవియా ఆరవ్‌తో మనసులోని మాట తెలిపింది. ఆమె ప్రేమను ఆరవ్‌ నిరాకరించడంతో మనస్తాపానికి గురైన ఓవియా ‘బిగ్‌బాస్‌' హోంలోని ఈతకొలనులో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

    ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి

    ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి

    అనంతరం ఈ షో నుంచి తప్పుకొన్న ఆమె చికిత్స పొందుతోంది. ఓవియా ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసింది. ఈ ఘటనపై ఓ సమాజ సేవకుడు పూందమల్లి నజరత్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా 100 రోజులు బిగ్‌బాస్‌ హోంలో ఉండాలని ప్రసారమవుతున్న కార్యక్రమాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయన్నారు.

    ఇన్‌స్పెక్టర్‌ జయచంద్రన్‌

    ఇన్‌స్పెక్టర్‌ జయచంద్రన్‌

    టీఆర్‌పీ రేటింగ్‌ పెంచుకొనేందుకు ప్రజల మనోభావాలను దెబ్బతీసే కార్యక్రమాలను ప్రసారం చేస్తున్న సదరు సంస్థలపై చర్యలు చేపట్టాలని, అలాగే, ఓవియా ఆత్మహత్యాయత్నంపై విచారణ చేపట్టాలని పిటిషన్‌లో కోరారు. దీనిపై ఇన్‌స్పెక్టర్‌ జయచంద్రన్‌, విచారణకు నేరుగా హాజరవాలని ఓవియాకు సమన్లు జారీ చేశారు.

    English summary
    A complaint has been filed saying that Oviya was driven to attempt suicide by the producers through the activities the actor was made to do. The complainant also claimed that the same was telecast by Vijay TV for TRPs.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X