Don't Miss!
- News సూర్య గోచారంతో మే 13వరకు ఈ రాశులకు సంపద వర్షం
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Sports DC vs GT: అందుకే డేవిడ్ వార్నర్‌ను పక్కన పెట్టాం: రిషభ్ పంత్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
బిగ్ బాస్ ప్రోమో: సీజన్ 2 ఎలా ఉండబోతోందో వెరైటీగా చెప్పాడు.. కమల్ స్టైల్లో!
Recommended Video
టివి రియాలిటీ షోలలో బిగ్ బాస్ పెద్ద సంచలనమే అని చెప్పొచ్చు. హిందీ, తమిళం తెలుగు ఇలా భాషా బేధం లేకుండా బిగ్ బాస్ షో కు బుల్లితెర ప్రేక్షకులను బ్రహ్మరథం పడుతున్నారు. బిగ్ బాస్ నిర్వాహకులు కూడా ప్రేక్షకులకు ఆసక్తితోపాటు, వినోదాన్ని కలిగించేందుకు ప్రతి సీజన్ లో కొత్త మసాలా దట్టిస్తున్నారు. తమిళంలో తొలి సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించిన విశ్వ నటుడు కమలే రెండవ సీజన్ కు కూడా హోస్ట్. తాజగా నిర్వాహకులు బిగ్ బాస్ సీజన్ 2 ప్రోమోని విడుదల చేశారు. ఈ సారి బిగ్ బాస్ ఎంత వెరైటీగా ఉండబోతోందో ఈ ప్రోమో ద్వారా చెప్పకనే చెప్పారు.
దృష్టి కోణం గురించి
ఈ ప్రోమోలో ఓ అంశాన్ని మనం చూసే కోణాన్ని బట్టి మన అభిప్రాయాలు మారుతుంటాయని కమల్ తన స్టైల్ లో వివరించారు. ఓ చక్కటి సన్నివేశంతో కమల్ ఈ విషయాన్ని వివరించారు.
|
ఎవరు మంచి వ్యక్తి
ప్రోమోలో చూపిన సన్నివేశంలో ఓ వ్యక్తి మహిళని నెట్టేసి ఖంగారుగా పరిగెడుతుంటాడు. చుట్టుపక్కల ఉన్న అందరూ అతడిని తప్పుగా చూస్తారు. కానీ అతడు ఓ పిల్లాడిని యాక్సిడెంట్ నుంచి కాపాడతాడు. ఈ విషయాన్ని కమల్ ఎవరు మంచి వ్యక్తి అంటూ వివరిస్తాడు.
అందరిని గమనించాల్సింది అతడే
హోస్ట్ గా వ్యవహరిస్తున్న కమల్ హాసన్ కంటెస్టెంట్స్ అందరిని క్షుణ్ణంగా గమనించాల్సి ఉంటుంది. తమిళంలో బిగ్ బాస్ తొలి సీజన్ కు మంచి రేటింగ్స్ వచ్చాయి. దీనితో నిర్వాహకులు కమల్ నే హోస్ట్ గా కొనసాగిస్తున్నారు. ఈ సారి 15 మంది కొత్త వారు పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.
తెలుగులో న్యాచురల్ స్టార్
తెలుగు బిగ్ బాస్ రెండవ సీజన్ కూడా త్వరలో ప్రారంభం కాబోతోంది. తొలి సీజన్ కు ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా రెండవ సీజన్ కు న్యాచురల్ స్టార్ నాని హోస్ట్ గా ఎంపికయ్యారు.