బిగ్ బాస్ విన్నర్ భలే ఛాన్స్ కొట్టేశాడు: ‘రాజభీమా’తో హీరోగా ఎంట్రీ, ఫస్ట్ లుక్ ఇదే!
రియాలిటీ షోల్లో బిగ్ బాస్ ఎంతటి సంచలనం క్రియేట్ చేస్తోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ రియాల్టీ షో కొందరి కెరీర్‌కు మరింత ప్లస్ అవుతోంది. ఒకపపుడు హిందీ బిగ్ బాస్ షో ద్వారా ఇండియన్ ఎంటర్టెన్మెంట్ రంగంలోకి వచ్చిన సన్నీ లియోన్ తర్వాత బాలీవుడ్లో స్టార్ రేంజికి ఎదిగింది. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం ఇలా వివిధ భాషల్లో ఈ రియాల్టీ షో ప్రసారం అవుతోంది. ఇందులో పాల్గొన్న పలువురు సెలబ్రిటీల తర్వాత వరుస అవకాశాలతో దూసుకెళ్లిన సందర్బాలు ఉన్నాయి.
తమిళంలో కమల్ హాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 1లో విజేత నిలిచిన అరవ్ ఇప్పుడు త్వరలో వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అరవ్ హీరో నటిస్తున్న చిత్రానికి రాజభీమా అనే టైటిల్ ఫిక్స్ చేశారు. సురభి ఫిలింస్ బ్యానర్‌పై నరేశ్ సంపత్ దర్శకత్వంలో ఎస్.మోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఎస్.మోహన్ మాట్లాడుతూ ఆరవ్‌ను హీరోగా పరిచయం చేస్తూ మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్‌తో.. వైవిధ్యమైన కథాంశంతో.. బ్యూటిఫుల్ లొకేషన్స్‌లో రాజభీమా చిత్రాన్ని నిర్మిస్తున్నాం. దర్శకుడు నరేశ్ సంపత్ అద్భుతమైన కథ, కథనంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలను తెలియజేస్తాం అన్నారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఎస్.ఆర్.సతీశ్ కుమార్, మ్యూజిక్: సైమాన్ కె.కింగ్, ఎడిటింగ్: గోపీ కృష్ణ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్: కరుణ్‌దేల్ రాజేశ్, ఆర్ట్: ఎ.ఆర్.మోహన్, స్టంట్స్: హరి దినేశ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కె.బి.బషీర్ అహ్మద్, ప్రొడ్యూసర్: ఎస్.మోహన్, దర్శకత్వం: నరేశ్ సంపత్.


Click it and Unblock the Notifications











