twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కమల్ హాసన్‌కు వెన్నుపోటు.. ద్రోహం.. బిగ్‌బాస్ బ్యూటీ సనమ్ శెట్టి ఫైర్

    |

    తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత విలక్షణ నటుడు, మక్కల్ నీది మైయమ్ పార్టీ అధినేత కమల్ హాసన్‌కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. పరాజయాన్ని జీర్ణించుకోలేని నేతలు పార్టీకి రాజీనామా చేస్తూ కమల్ హాసన్‌ను ఇబ్బందుల్లో పడేస్తున్నారు. ఇప్పటికే పార్టీ ఉపాధ్యక్షుడు డాక్టర్ మహేంద్రన్‌తోపాటు ఇతర నేతలు మౌర్య ఐపీఎస్, ఉమాదేవి, తంగవేల్, మురుగానందమ్, డాక్టర్ సంతోష్ బాబు ఐఏఎస్, పద్మప్రియ తదితరులు పార్టీని వీడటం తెలిసిందే. అయితే తాజాగా బిగ్‌బాస్ బ్యూటీ సనమ్ శెట్టి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్న నేతలపై మండిపడుతూ కమల్ హాసన్‌కు అండగా నిలిచారు.

    తమిళనాడు ఎన్నికల్లో ఒక్క సీటు సంపాదించుకోలేకపోవడం, నేతలందరూ రాజీనామా చేస్తూ బయటకు వెళ్లిపోవడంతో కమల్ హాసన్ నాయకత్వం ప్రతిభకు ఓ సవాల్‌గా నిలుస్తుందనే మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నది. ఈ క్రమంలో సనమ్ ట్వీట్ చేస్తూ.. వ్యక్తిగత కారణాలంటూ రాజీనామా చేయడం దారుణం.. మీకు ఉన్న వ్యక్తిగత కారణాలు ఏమిటి? అంటూ ప్రశ్నించారు.

    Bigg Boss Telugu fam Sanam Shetty fires on Kamal Haasans Makkal Needhi Maiam leaders for resign

    ప్రజలకు సేవ చేయాలంటే అధికారమే కావాలా? కమల్ సార్‌ను విడిచిపెట్టడం సరైన పని కాదు. ప్రజా సేవ చేయడానికి కమల్ సార్‌కు అధికారం అక్కర్లేదు. రాజీనామా చేస్తున్న వాళ్లంతా పార్టీకి ద్రోహం, వెన్నుపోటు పొడుస్తున్నట్టే అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. మీరంతా తొలిసారి పోటీలో నిలిచారు. అయినా మీ కోసం ప్రజలంతా ఓట్లు వేసి మద్దతు తెలిపారు అంటూ కామెంట్ చేశారు.

    సనమ్ శెట్టి కెరీర్ విషయానికి వస్తే.. అంబులీ సినిమా ద్వారా 2012లో సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత సింగమ్ 123, సవారీ, టికెట్, అథర్వ, వాల్టర్ లాంటి చిత్రాల్లో నటించారు. తెలుగులో ప్రేమికుడు, శ్రీమంతుడు చిత్రాల్లో కనిపించారు. కురతి కాలమ్ వెబ్ సిరీస్‌లో నటించారు. అలాగే బిగ్‌బాస్ తమిళ్ 4లో తనదైన శైలిలో రాణించారు.

    English summary
    Many leaders of Kamal Haasan's Makkal Needhi Maiam party has been resigning. They are quoting that Personal reasons for quitting the party. In this occassion, Bigg Boss Telugu fame, Actress Sanam Shetty fires on the leader.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X