బిగిల్ మరో సెన్సేషన్: సెన్సార్ అధికారులు చేతులెత్తేశారు.. దీపావళికి..
తమిళ సూపర్‌స్టార్ విజయ్, సక్సెస్ చిత్రాల దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న బిగిల్ సినిమా రిలీజ్‌కు ముందే సంచలనాలను క్రియేట్ చేస్తున్నది. విజయ్, అట్లీ కాంబినేషన్‌లో ఇది మూడో చిత్రం విశేషం. ఇటీవల రిలీజైన ఈ చిత్ర ట్రైలర్ కేవలం దక్షిణాది సినీ ప్రముఖులనే కాకుండా బాలీవుడ్ సినీ తారలను విశేషంగా ఆకట్టుకొన్నది. ఈ చిత్రం తెలుగులో విజిల్ అనే పేరుతో దీపావళీ కానుకగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలు మీ కోసం..

భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్
బిగిల్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా థియేట్రికల్ హక్కులు, నాన్ థియేట్రికల్ హక్కుల మొత్తంగా సంచలన రీతిలో బిజినెస్ జరగడం ట్రేడ్ వర్గాలను షాక్ గురిచేశాయి. ఈ చిత్ర హక్కులు రూ.210 కోట్ల వద్ద క్లోజ్ అయినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ బిజినెస్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

క్లీన్ సర్టిఫికెట్
అక్టోబర్ 14 సోమవారం బిగిల్ సినిమా సెన్సార్ పూర్తి చేసుకొన్నది. సింగిల్ కట్ చేయకుండా ఈ చిత్రానికి క్లీన్ సర్టిఫికెట్‌ను అధికారులు ఇచ్చినట్టు తెలిసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా పైసా వసూల్ అనే టాక్ ట్రెండ్ అవుతున్నది. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చినట్టు సమాచారం. అధికారికంగా సర్టిఫికెట్ విడుదల చేయాల్సి ఉంది.

180 కోట్ల వ్యయంతో
ఇక బిగిల్ సినిమా విషయానికి వస్తే.. విజయ్ కెరీర్‌లోనే గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందింది. ఈ చిత్రాన్ని రూ.180 వ్యయంతో అత్యంత రిచ్‌గా, టెక్నికల్‌గా తెరకెక్కించారు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఫుట్‌బాల్ క్రీడా నేపథ్యంగా సాగుతుంది.

రికార్డుస్థాయిలో ట్రైలర్‌కు స్పందన
ఇక భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న బిగిల్ చిత్రంలో విజయ్ సరసన నయనతార, బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ నటిస్తున్నారు. ఇంకా కథిర్, యోగిబాబు, ఇందుజా రవిచంద్రన్, వర్ష బొల్లమ్మ, అమృతా నాయర్ నటిస్తున్నారు. ఇటీవల రిలీజైన బిగిల్ ట్రైలర్ 23,550,430 వ్యూస్ సాధించింది.


Click it and Unblock the Notifications











