విజయ్ vs అజిత్.. #BigilDisaster అంటూ ఫ్యాన్స్ నిర్వాకం.. తీవ్రస్థాయికి సోషల్ మీడియా వార్
తమిళనాడు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం సూపర్ స్టార్స్ విజయ్, అజిత్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో వార్ తీవ్ర స్థాయిలో జరుగుతున్నది. శృతిమించిన ట్వీట్లు, ఫేస్‌బుక్ పోసర్లతో యుద్ధాన్ని మరిపించేలా చేస్తున్నారు. గతంలో విజయ్ ఇకలేడంటూ ట్వీట్ చేసిన అజిత్ ఫ్యాన్స్ వ్యవహారం మీడియాలో పెద్ద దుమారం రేపింది. ఆ వార్ మళ్లీ ఇంకా మీడియాలో చెలరేగుతూనే ఉంది. తాజాగా బిగిల్ సినిమా రిలీజ్ నేపథ్యంలో డిజాస్టర్ ట్యాగ్‌తో ట్రెండింగ్ చేయడంతో మళ్లీ వార్ మొదలైంది. వివరాల్లోకి వెళితే...

బిగిల్‌కు వ్యతిరేకంగా
విజయ్ నటించిన బిగిల్ చిత్రం అక్టోబర్ 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఉదయమే #BlockBusterBigil లాంటి ట్యాగ్స్‌తో ట్విట్టర్‌లో బిగిల్ ట్రెండింగ్‌గా నిలిచింది. ఇక మార్నింగ్ షో తర్వాత ఆ ట్యాగ్ వెనుకబడి #BigilDisaster అనే ట్యాగ్ టాప్ ట్రెండింగ్‌గా మారింది.

బిగిల్ డిజాస్టర్ ట్యాగ్
#BigilDisaster ట్యాగ్‌ను ట్రెండ్ చేయడం వెనుక అజిత్ ఫ్యాన్స్ పూర్తిస్థాయిలో విజృంభించారనే విషయాన్ని తమిళ సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. అజిత్ ఫ్యాన్స్‌గా భావిస్తున్న కొందరు వీడియోలను, ట్వీట్లను పోస్టు చేసి బిగిల్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయి.

విజయ్ సినిమాకు స్పందన కరువు
బిగిల్‌పై వ్యతిరేక ప్రచారం ఏ రేంజ్‌లో ఉందంటే.. ఓ నెటిజన్ పెట్టిన ట్వీట్ చూస్తే తెలుస్తుంది. 90 శాతం ఆంధ్రా ప్రజలకు బిగిల్ రిలీజ్ అవుతుందనే విషయమే తెలియదు. కానీ విజయ్ మాత్రం ఈ సినిమాతో పాగా వేయాలని అనుకొంటున్నారు. అయితే బిగిల్‌కు అసలు స్పందన కరువైంది. టికెట్ల బుకింగ్ మాత్రం షాకింగ్‌గా ఉంది. రిలీజ్‌కు ముందు పరిస్థితి చూసి భారీ నష్టం రావడం ఖాయమని డిస్టిబ్యూటర్లు తలలుపట్టుకొంటున్నారు అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.

2019, 2020లో అజిత్‌దే హవా
2019లో తలా అజిత్‌దే హవా నడించింది. విశ్వమ్ బ్లాక్ బస్టర్, ఎన్‌కేపీ సెన్సేషనల్ హిట్, ఇక 2020లో విడుదలయ్యే వాలిమాయి కూడా హిట్టే. మా కింగ్ మేకర్ వాలిమాయి ఎంట్రీ అదిరిపోతుంది. #BigilDisaster అంటూ ట్వీట్ చేశారు. ఇలాంటి పోస్టులు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతుండటం, దానికి విజయ్ ఫ్యాన్స్ కౌంటర్ ఇవ్వడం జరుగుతున్నది.


Click it and Unblock the Notifications











