'బిల్లా-2' చిత్రం రిలీజ్ వివరాలు

By Srikanya

తమళంలో వచ్చిన 'బిల్లా'చిత్రాన్ని ఆ మధ్యన ప్రభాస్ తో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే అజిత్ తో 'బిల్లా-2'చిత్రాన్ని రెడీ చేసారు. బిల్లాకు ప్రీక్వెల్ గా రెడీ అయిన ఈ చిత్రాన్ని మాత్రం రీమేక్ రైట్స్ ఇవ్వకుండా డబ్బింగ్ చేస్తున్నారు. వారు తమ ఒరిజనల్ వర్క్ ని తెలుగు ప్రేక్షకులకు చూపించాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ మేరకు ఓ పెద్ద నిర్మాత బిల్లా 2 రైట్స్ తీసుకున్నట్లు సమాచారం. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. అయితే ఈ చిత్రాన్ని తెలుగులో అనువదిస్తారా? లేక పునర్నర్మిస్తారా? అన్న విషయం పై ఇన్నాళ్లూ సప్సెన్స్ ఉంది. అయితే ఇప్పుడు అది విడిపోయింది. అంతా ప్రభాస్‌ తో రీమేక్ చేస్తారని ఆసించారు. అయితే ఆ అంచనాలను కాదని వారు నిర్ణయం తీసుకున్నారు.

మరో ప్రక్క అజిత్‌ నటించిన 'గ్యాంబ్లర్‌' చిత్రం ఇటీవల తెలుగులో అనువాదమైనా పెద్దగా వర్కవుట్ కాలేదు. అయినా ఈ చిత్రానికి మంచి బిజినెస్ జరుగుతుందని భావిస్తున్నారు. ఇక ఆ మధ్య కమల హాసన్‌, వెంకటేష్‌ లు నటించిన 'ఈనాడు' చిత్రానికి దర్శకత్వం వహించిన చక్రి తోలేటి ఈ తాజా చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అజిత్‌ సరసన పార్వతి ఓమనకుట్టన్‌, బ్రునా అబ్దుల్లా నాయికలుగా నటిస్తున్నారు. యువన్‌ శంకర్‌రాజా సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ పార్ట్‌ పూర్తయింది. వేసవి సందర్భంగా మేలో సినిమాను విడుదల చేస్తారని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X