కొత్త బిల్లాను చూసిన పాత బిల్లా!
బిల్లా సినిమాలో హీరో సూపర్ స్టార్ రజనీకాంత్. బిల్లా సినిమాలో హీరో అజిత్. అవును మొదటగా రూపొందించిన బిల్లాలో రజనీకాంతే హీరో. తాజాగా రూపొందిన బిల్లా-2007 సినిమాలో అజిత్, నయనతార, నమిత హీరో హీరోయిన్లు. తాజాగా రూపొందిన బిల్లా సినిమాను పాత బిల్లా వీక్షించాడు.
బెంగుళూరు నుంచి బుధవారం చెన్నయ్ కి వచ్చిన రజనీకాంత్ రాగానే అజిత్ బిల్లా సినిమా ఎలా ఆడుతోంది...ఎలా ఉంది అని అడిగాడట. అది తెలుసుకున్న అజిత్, ఆయన భార్య శాలినిలూ సూపర్ స్టార్ కోసం ఫోర్ ఫ్రేమ్స్ ప్రివ్యూ థియేటర్ లో సినిమాను ప్రదర్శించారు. సినిమాను చూసిన రజనీకాంత్ అజిత్ ను ప్రశంసించాడుట. కొత్త బిల్లానే బావున్నాడు...సినిమా ఆనందాన్ని ఇచ్చింద...ని సూపర్ స్టార్ అన్నాడట. అసలు ఈ బిల్లా రీమేక్ కోసం అజిత్ ను పురికొల్పిందే రజనీకాంతట. పరిశ్రమలో తన స్థానం సుస్థిరం చేసుకోవాలనుకుంటున్న అజిత్ కిది లాభం చేకూర్చేలా ఉందిట.


Click it and Unblock the Notifications











