ఏ మాయ చేసావె డైరెక్టర్ చేతిలో వేశ్యగా మారిన బిందు మాధవి..
'ఘర్షణ", 'ఏ మాయ చేసావె" లాంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన గౌతమ్ మీనన్ ఫోటాన్ కథాస్ పేరిట ఓ బ్యానర్ ను ఆరంభించిన విషయం తెలిసిందే. ఈ బ్యానర్ లో బిందు మాధవి హీరోయిన్ గా 'వెప్పమ్" అనే తమిళ సినిమాని గౌతమ్ మీనన్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి గౌతం అసిస్టెంట్ డైరెక్టర్ అంజనా అలీఖాన్ ను దర్శకుడు పరిచయం చేస్తున్న ఈ సినిమాలో బిందు మాధవి వేశ్యగా నటిస్తోంది.
అంజనా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే కోలీవుడ్ వర్గాలను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో తెలుగు హీరో నాని హీరోగా ప్రధాన పాత్ర చేస్తుండగా కథానాయికగా ఈ సినిమాలో బిందుమాధవి ఫుల్ గ్లామర్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రంలో తన ఫోటోలు పలువురు తమిళ దర్శక, నిర్మాతల దష్టిని ఆకట్టుకున్నాయని సమాచారం. ఖచ్చితంగా ఈ సినిమా తర్వాత కోలీవుడ్ లో బిందు మాధవి కెరియర్ బాగుంటుందని చెన్నై వర్గాలు అంటున్నాయి.
More from Filmibeat
బిందు మాధవి గౌతమ్ మీనన్ వెప్పమ్ ఘర్షణ ఏ మాయ చేసావె bindu madhavi gautam menon veppam gharshana ye maya chesave


Click it and Unblock the Notifications











