బిందుమాధవిని సిల్క్ స్మితలా ఉంటుందన్న దర్శకుడు
'తుల్లాద మనముం తుల్లుం', 'పెన్నిన్ మనదై తొట్టు', 'దీపావళి', 'పూవెల్లాం ఉన్‌వాసం', తాజాగా 'మనం కొత్తి పరవై' వంటి ప్రేమకథా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న దర్శకుడు ఎళిల్. ఇప్పుడు అలాంటి అంశంతోనే జనం ముందుకు రాబోతున్నాడు. పల్లెటూరి ప్రేమకథతో 'దేశింగురాజా' తెరకెక్కిస్తున్నాడు. విమల్, బిందుమాధవి హీరో,హీరోయిన్స్. సినిమా గురించి ఆయన మీడియాతో మాట్లాడుతూ బిందుమాధవి గురించి ఇలా చెప్పుకొచ్చారు.
అలాగే తాను ప్రేమ కథలే తెరకెక్కించటానికి కారణం చెప్తూ...ప్రేమలో విఫలమయ్యాను అన్నారు. కోయంబత్తూరులో నేను డిగ్రీ మొదటి ఏడాది చదివేటప్పుడు తను పీజీ. తొలిచూపు ప్రేమ నాది. వయోభేదం ఉన్నా ఎలాగైనా ఒప్పించాలని అనుకున్నా. పరిచయం పెరిగింది. మంచి స్నేహితులం అయ్యాం. ఒకసారి ప్రాజెక్టు విషయమై గ్రామంలో తనతో బసచేసే అవకాశం కలిగింది. అప్పుడు నా మనసులో మాట చెప్పా. కుదరదని చెప్పేసింది. ఒప్పించేందుకు చాలా ప్రయత్నించా. ఫలించలేదు. ఆ తర్వాత ఆమె నన్ను కలిసేందుకే కాదు.. మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వలేదు. ప్రేమ బాధను తట్టుకోలేకపోయా. అందుకే ఈ సినీ 'ప్రేమ ప్రయాణం' అన్నారు.
స్టార్ హీరోలు అజిత్, విజయ్ వంటి పెద్ద నటులతో సినిమాలు చేశారు. ఇప్పుడు ఆ స్థాయి తగ్గుతోందనే విమర్శలకు సమాధానం చెప్తూ... ప్రారంభంలో పెద్ద హీరోలతో చేసినందుకే ఇప్పుడు ఆ స్థాయిని కొనసాగించలేకపోతున్నానని అనిపిస్తోంది. వెంటవెంటనే చిత్రాలు చేయలేకపోవడానికి అదే కారణం. నేను తెరకెక్కించిన వాటిలో ఒక్కటి మాత్రమే నిరాశపరిచింది. అదే సమయంలో ఆర్థికంగా కూడా ఇబ్బందులొచ్చాయి. అందుకే స్థాయి తగ్గించుకున్నాను. ఇప్పుడిప్పుడే మునుపటిస్థాయికి చేరుకునేందుకు అడుగులు వేస్తున్నాను అన్నారు.


Click it and Unblock the Notifications












