బిందుమాధవికి షాక్!
చెన్నై : తెలుగు అమ్మాయి బిందుమాధవికి తమిళనాట షాక్ తగిలింది. 'మిరట్టల్' తర్వాత వినయ్ హీరోగా 'ఇరువర్ ఉల్లం'లో నటిస్తున్నాడు. ఇందులో హీరోయిన్ గా బిందుమాధవిని ఎంపిక చేశారు.
కానీ 'సట్టం ఓర్ ఇరుట్టరై', 'కేడీ బిల్లా కిలాడి రంగా' చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉండటంతో ఈ సినిమాలో సంతకం పెట్టడంలో అమ్మడు జాప్యం చేసింది. కొన్ని రోజుల తర్వాత చేస్తానని చెప్పిందట.
'ఇరువర్ ఉల్లం' నిర్మాత వేచి చూసి... చివరకు ఆమె స్థానంలో ఓ ముంబయి మోడల్‌ను ఎంపిక చేశారట. అంతేకాక.. చిత్రీకరణ కూడా దాదాపు పూర్తయిందట. ఈ విషయం తెలియని బిందుమాధవి... కొన్నిరోజుల క్రితం ఫోన్ చేసి కాల్షీట్ ఇస్తానందట. నిర్మాత చెప్పిన మాటలతో షాక్ తినడం ఈ ముద్దుగుమ్మ వంతైంది.
తెలుగులో తన నటజీవితాన్ని ప్రారంభించిన ఆమె ఇప్పుడు తమిళ చిత్రరంగంలో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఆమె నటిస్తున్న రెండు తమిళ చిత్రాలు ప్రస్తుతం షూటింగ్ జరుపుకొంటున్నాయి. తెలుగు హీరోయిన్స్ కావాలనే దర్శక,నిర్మాతలు ఎవరూ ఆమెను ప్రోత్సహించటం లేదు.


Click it and Unblock the Notifications












