బిరియాని వండి పెట్టి మరీ కాకాపడుతోంది

By Srikanya

చెన్నై : కూటి కోసం కోటి విద్యలు అన్నట్లు వేషాలు కోసం రకరకాల కొత్త పుంతలు తొక్కుతున్నారు హీరోయిన్స్. తాను నటిస్తున్న సినిమా చిత్రీకరణ పూర్తయ్యాక.. చిత్ర యూనిట్‌ అందరికీ బిరియాని వడ్డించడం 'తల' అజిత్‌కు అలవాటు. అదీ స్వయంగా తానే వండి మరీ పెట్టడం ఆయన ప్రత్యేకత. ఇక అమ్మ చేసే బిరియానిని తన స్నేహితులకు తీసుకొచ్చి ఇవ్వడం నటుడు ఆర్య అలవాటు. ఇప్పుడా వరుసలో నటి ప్రియాఆనంద్‌ కూడా చేరింది. 'ఎదిర్‌నీచ్చల్‌' చిత్రంతో ఆమెకు కోలీవుడ్‌లో స్టార్‌డం దక్కింది.

ప్రస్తుతం 'వై రాజా వై', 'అరిమానంబి', 'ఇరుంబు కుదిరై', 'ఒరు వూర్ల రెండు రాజా' చిత్రాల్లో హీరోయిన్‌గా నటిస్తూ బిజీగా ఉంది. ఇటీవల 'ఒరు వూర్ల రెండు రాజా' చిత్ర యూనిట్‌కు తాను వండిన బిరియాని తీసుకొచ్చి విందు ఇచ్చిందట ప్రియ. దీనికోసం ప్రత్యేకించి ఓ మాస్టరు వద్ద వండటం నేర్చుకుందీ భామ. స్నేహితుల కోసమే ఈ విందు, వినోదమని ప్రియ చెబుతుంటే.. సినిమా అవకాశాల కోసం అమ్మడు ఇలా కొత్త అడుగులు వేస్తోందని చెవులు కొరుక్కుంటున్నారు ఇతర హీరోయిన్లు.

దగ్గుపాటి రానా లీడర్ తో టాలీవుడ్‌లో తెరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ ప్రియా ఆనంద్‌. అనంతరం 180 లతో,శర్వానంద్ సరసన కో అంటే కోటి చిత్రాలతో సినీజనాలను అలరించింది. ఆ తర్వాత తెలుగులలో కనిపించలేదు. తాజాగా శ్రీదేవి నటించిన 'ఇంగ్లీష్‌ వింగ్లీష్‌'లో అల్లరి అమ్మాయిగా మెరిసింది. కానీ ఆమె ఆశించినంతగా తెలుగులో ఆఫర్స్ ఆమెను వెతుక్కుంటూ రాలేదు. దాంతో తమిళంపైనే దృష్టి పెట్టింది. అక్కడ ఎలాగైనా నిలదొక్కుకోవాలనే ప్రయత్నంలో ఉంది.

‘Biryani’ is the dream of Priya anand

రజనీకాంత్‌ తో నటించటమే తన ఆశయమని చెపుతూ... వద్దని చెప్పినా.. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ పేరే చెబుతా. ఆయనతో ఒక్క దృశ్యంలో కనిపించినా సంతోషమే. 'ఇంగ్లీష్‌ వింగ్లీష్‌'ను రజనీకాంత్‌ పక్కన కూర్చుని చూశాను. చాలా ఎంజాయ్‌ చేశా. వెళ్తూ.. వెళ్తూ నన్ను అభినందించారు. నా జీవితంలో చాలా సంతోషకరమైనరోజదే అన్నారు. అలాగే తన జీవితంలో సినిమాలో నన్ను ఎలా చూస్తున్నారో.. నిజ జీవితంలోనూ అలాగే ఉంటా. అల్లరి ఏమాత్రం తగ్గదు. నవ్వుతూ.. ఇతరులనునవ్వించాలనుకుంటా అన్నారు.

ఇక బాలీవుడ్‌లో తన ఎంట్రీ గురించి చెప్తూ... పరిశ్రమలోకి ఎవరి సిఫారసు లేకుండా అడుగుపెట్టాను. నేను నటించిన పాత్ర కోసం బెంగళూరు, ముంబయి, ఢిల్లీ, లాస్‌ ఏంజెల్స్‌ తదితర ప్రాంతాల్లో ఆడిషన్స్‌ జరిపారు. చివరిగా నన్ను ఎంపిక చేశారు. ఒకప్పుడు బాలీవుడ్‌ నుంచి తమిళనాడుకు హీరోయిన్స్ వచ్చేవారు. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్లి అక్కడ శాసిస్తున్నారు. ఇక చిన్న వయసు నుంచే శ్రీదేవికి పెద్ద అభిమానిని. ఆమెకు చాలా లేఖలు, పెయింటింగ్స్‌ పంపాను. అలాంటి అభిమాన తారతో కనిపించడం నిజంగానే అదృష్టం. సినిమాలో నటించేందుకు చాలా సహకరించారు. వ్యక్తిగతంగానూ సలహాలు ఇచ్చారు అంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X