Just In
- 16 min ago
టాలీవుడ్లో మరో భారీ మల్టీస్టారర్: బన్నీ, విజయ్ కాంబోలో మూవీ.. చిన్న డైరెక్టర్.. పెద్ద నిర్మాత ప్లాన్!
- 43 min ago
భర్త చేసిన పనికి అప్పుడే కన్నీళ్లు పెట్టుకున్న నిహారిక.. ఏకంగా వీడియో రిలీజ్ చేసి..
- 1 hr ago
మళ్లీ ప్రేమలో పడ్డ శృతి హాసన్: అతడితో అయిపోయిందంటూ.. పుసుక్కున నోరు జారి బుక్కైంది
- 2 hrs ago
RRR నుంచి అదిరిపోయే అప్డేట్: గుడ్ న్యూస్ చెప్పిన ఎన్టీఆర్, చరణ్.. వాళ్లిచ్చే సర్ప్రైజ్ అదే!
Don't Miss!
- News
అప్పుడెందుకు వాయిదా వేశారు ? జగన్ కు మద్దతుగా పంచాయితీ పోరుపై నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు
- Finance
సెన్సెక్స్ దిద్దుబాటు! నిర్మల ప్రకటన అంచనాలు అందుకోకుంటే.. మార్కెట్ పతనం?
- Lifestyle
Zodiac signs: మీ రాశిని బట్టి మీకు ఎలాంటి మిత్రులు ఉంటారో తెలుసా...!
- Sports
ఇంగ్లండ్ అలా చేయకుంటే భారత్‌ను అవమానపరిచినట్టే.. జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్ల ఫైర్!
- Automobiles
ఇదుగిదిగో.. కొత్త 2021 ఫోర్స్ గుర్ఖా; త్వరలో విడుదల, కొత్త వివరాలు వెల్లడి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
విజయ్‌పై ఐటీ రైడ్స్.. పార్టీ కార్యకర్తలకు, ఫ్యాన్స్ మధ్య వాగ్వాదం.. షూటింగ్ రచ్చ రచ్చ
తమిళ నాట దళపతి విజయ్‌పై ఐటీ రైడ్స్ రోజుకో రూపు సంతరించుకుంటుంది. బిగిల్ చిత్ర విషయం చూపిన లెక్కలు తప్పుగా ఉండటంతో ఈ రైడ్స్ జరుగుతున్నాయి. బిగిల్ చిత్ర నిర్మాత, డిస్ట్రిబ్యూటర్స్, ఫైనాన్షియర్స్, హీరోపై ఐటీ రైడ్స్ జరిగాయి. ఈ తనిఖీల్లో లెక్కల్లోకి రాని దాదాపు రూ. 77కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వ్యవహారం కాస్తా.. రాజకీయ రంగు పులుముకోవడంతో రూపురేఖలు మారిపోయాయి.

కావాలనే విజయ్‌ను టార్గెట్..
విజయ్‌ను కావాలనే టార్గెట్ చేస్తున్నారని, దీనిలో బీజేపీ, అన్నాడీఎంకే కుట్ర ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. విజయ్ రాజకీయాల్లోకి వస్తాడేమోనన్న భయంతో, వారికి వ్యతిరేకంగా సినిమాల్లో డైలాగ్స్ చెబుతున్నాడని కారణంతో ఇలా ఐటీ రైడ్స్ చేయిస్తున్నారని తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

పలువురి మద్దతు..
విజయ్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేయడంపై ఆయనకు రాజకీయ నాయకుల మద్దతు పెరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు, నామ్‌తమిళర్ పార్టీ నేత సీమాన్, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు విజయ్‌కు మద్దతుగా నిలిచారు. ఇలా ఈ వ్యవహారం పూర్తిగా రాజకీయంగా మారిపోయింది.

షూటింగ్‌లో రచ్చ..
విజయ్ ప్రస్తుతం మాష్టర్ చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ షూటింగ్ నైవేలిలోని ఎన్‌ఎల్‌సీ సొరంగం ప్రాంతంలో చిత్రీకరణ జరుగుతున్న సమయంలోనే ఐటీ అధికారులు అక్కడకు వచ్చి ఆయన్ని విచారించారు. తాజాగా ఆ ప్రాంతంలోనే విజయ్ షూటింగ్‌లో పాల్గొంటే బీజేపీ కార్యకర్తలు వచ్చి వ్యతిరేక నినాదాలు చేశారు.

రంగంలోకి ఫ్యాన్స్..
అలా బీజేపీ కార్యకర్తలు షూటింగ్‌కు అడ్డు తగులుతున్న విషయం తెలుసుకున్న ఫ్యాన్స్.. ఆ ప్రాంతానికి చేరుకుని బీజేపీ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. అది కాస్తా గొడవకు దారి తీసి రచ్చరచ్చగా మారింది. దీంతో పోలీసులు కలుగుజేసుకుని వ్యవహారాన్ని సద్దుమణిగేలా చేశారు. ఈ సంఘటనతో విజయ్ నటిస్తున్న మాస్టర్ చిత్ర షూటింగ్‌కు పోలీసుల భద్రతను పెంచినట్టు తెలుస్తోంది.