»   » ఆ సినిమా చేస్తే ఊరుకోం: రజనీకాంత్‌కు బీజేపీ వార్నింగ్

ఆ సినిమా చేస్తే ఊరుకోం: రజనీకాంత్‌కు బీజేపీ వార్నింగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నరేంద్రమోడీకి మద్దతుగా నిలవడం ద్వారా రజనీకాంత్ కూడా బీజేపీ పార్టీ మద్దతుదారుడిగా ముద్ర పడిన సంగతి తెలిసిందే. అలాంటి రజనీకి అదే పార్టీ నేతల నుండి ఇబ్బంది ఎదురవ్వడం హాట్ టాపిక్ అయింది. రజనీకాంత్ త్వరలో ‘టిప్పు సుల్తాన్' సినిమా చేయడానికి సిద్దమవుతున్న నేపథ్యంలో బీజేపీ నేతలు రజనీకాంత్ కు వార్నింగ్ ఇచ్చారు.

టిప్పు సుల్తాన్ 18వ శతాబ్దంలో మైసూరును కేంద్రంగా పాలించిన సంగతి తెలిసిందే. బ్రిటిష్ వారి పాలిట సింహ స్వప్నంలా... వారిని గడగడలాడించిన టిప్పు సుల్తాన్ వీర గాథ ఒక ఎత్తయితే.....ఆయన తమిళులకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టారనే వాదన కూడా ఉంది. ఈ నేపధ్యంలో తమిళుల వల్ల సూపర్ స్టార్ రేంజికి ఎదిగిన రజనీకాంత్ ఈ సినిమా చేయడమే ఏమిటంటూ పలు తమిళ సంఘాలు ఆగ్రహంగా ఉన్నారు.

BJP Demands Rajinikanth Not to Star in Tipu Sultan Biopic

రజనీకాంత్ ‘టిప్పు సుల్తాన్' సినిమా చేస్తే తమిళుల ఆత్మగౌరవం దెబ్బతీసినట్లే, వెంటనే ఆయన ఆ సినిమా నుండి తప్పుకోవాలలని బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్ గణేశన్ వ్యాఖ్యనించినట్లు సమాచారం. హిందువులపై దాడి చేసిన టిప్పు సుల్తాన్ చిత్రంలో నటించడంపై రజినీకాంత్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారని భావిస్తున్నామని ఆయన అన్నారు.

ఒక వేళ రజనీకాంత్ టిప్పు సుల్తాన్ సినిమా మొదలు పెడితే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో రజనీకాంత్ ఆ సినిమా చేసే అవకాశాలు లేవని తమిళ సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

English summary
After a Hindu outfit issued a warning to superstar Rajinikanth against accepting an offer to star in the film based on life of Tipu Sultan, the former Mysore Kingdom ruler, Bharthiya Janta Party (BJP) has echoed a similar opinion on the issue.
Please Wait while comments are loading...