త్రిషను వదిలేయ్.. దళపతి విజయ్‌పై బీజేపీ నేత సంచలన ఆరోపణలు
దాదాపు మూడు దశాబ్థాల సినీ కెరీర్‌ను ప్రజల కోసం విడిచిపెట్టి రాజకీయాల్లోకి దిగారు కోలీవుడ్ సూపర్‌స్టార్ విజయ్ దళపతి. తమిళగ వెట్రి కజగం (టీవీకే) పేరుతో రాజకీయ పార్టీని స్థాపించి 2026 తమిళనాడు ఎన్నికల బరిలో నిలిచారు దళపతి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రచారం చేస్తున్నారు. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలపై వాడి వేడి విమర్శలు చేస్తూ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు పావులు కదుపుతున్నారు. రాజకీయాల్లోకి దిగడం, ఇక్కడ నిలబడటం అంత ఆషామాషీ కాదు. పూలు పడిన చోటే రాళ్లుపడతాయి. ప్రశంసలనే కాదు విమర్శలను కూడా తట్టుకుని నిలబడాలి. ఈ క్రమంలోనే విజయ్‌పై డీఎంకే, ఏఐడీఎంకే, బీజేపీ ఇతర పార్టీల నేతలు విమర్శలు చేస్తున్నారు. తాజాగా దళపతిపై బీజేపీ నేత నాయనర్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..
మూడు దశాబ్థాలుగా తమిళ చిత్ర పరిశ్రమలో స్టార్‌గా వెలుగొందుతున్నారు విజయ్. సూపర్‌స్టార్ రజనీకాంత్ తర్వాత ఆ స్థాయిలో ఫాలోయింగ్, క్రేజ్ ఉన్న నటుడిగా విజయ్ ఘనత సాధించారు. ఆయన నటించిన సినిమాలు వందల కోట్లు వసూళ్లు సాధించి సరికొత్త రికార్డులు నెలకొల్పాయి. విజయ్ డేట్స్ కోసం నిర్మాతలు క్యూలో ఉన్నారు. కోరినంత రెమ్యునరేషన్ ఇచ్చేందుకు కూడా వెనుకాడటం లేదు. అయితే తనకు ఇవన్నీ వద్దని తమిళనాడు ప్రజలకు సేవల చేసుకుంటే చాలని చెబుతున్నాడు విజయ్. తాను ముఖ్యమంత్రినైతే ఏమేం చేస్తానో చెబుతున్నాడు దళపతి.

తమిళనాడులో ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో వివిధ సర్వేలు ఆసక్తికరంగా తమ నివేదికలను వెల్లడిస్తున్నాయి. తమిళనాడులో చతుర్ముఖ పోటీ ఖాయమని పలు ఏజెన్సీలు చెబుతున్నాయి. అధికార ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) కూటమి అధికారాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నిస్తుండగా.. అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే) - బీజేపీ కూటమి ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తోంది. అటు సీమాన్ నామ్ తమిళర్ కట్చి (ఎన్‌టీకే), విజయ్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు నడిచే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
కాగా.. రాజకీయాల్లో దిగిన నాటి నుంచి విజయ్ వ్యక్తిగత జీవితంపై ప్రత్యర్ధులు వాడివేడి విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా అగ్రనటి త్రిషతో ఆయనకు ఎఫైర్ ఉందని, త్వరలోనే ఆమెను పెళ్లాడబోతున్నట్లుగా ఎప్పటి నుంచో కోలీవుడ్‌లో పుకార్లు వినిపిస్తున్నాయి. వీటిని ఆసరా తీసుకుని నేతలు విమర్శలు కురిపిస్తున్నారు. కొందరైతే టీవీకే అంటే త్రిష, విజయ్, కీర్తి సురేష్ అంటూ హేళనగా మాట్లాడుతున్నారు. అయినప్పటికీ విజయ్ వీటిపై పెద్దగా స్పందించడం లేదు. తాజాగా విజయ్ - త్రిషల బంధంపై తమిళనాడు బీజేపీ నేత నాయనర్ నాగేంద్రన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
శనివారం నాగేంద్రన్ మీడియాతో మాట్లాడుతూ.. ముందు విజయ్ ఇంట్లో నుంచి బయటకు రమ్మనండి. త్రిషతో అనుబంధం నుంచి తప్పుకుంటేనే తన చుట్టూ ఏం జరుగుతుందో విజయ్‌కి తెలుస్తుంది. విజయ్‌కున్న రాజకీయ అనుభవం శూన్యం. పాపం విజయ్‌కి ఏం తెలియదు, అతనికి అనుభవం ఏదు. ముందుగా అతను ఇంటి నుంచి బయటికొచ్చి చూడాలి. త్రిషతో ఉన్న అనుబంధాన్ని వదులుకుంటేనే విజయ్ వాస్తవ ప్రపంచాన్ని చూడగలడు. ఒక రాష్ట్రాన్ని నడిపించడానికి ముందు అతను తన కుటుంబంలోని సంబంధాలను సరిదిద్దుకోవాలి. ముందు తన కుటుంబంతో సరైన సంబంధాలను కొనసాగించాలి. గొప్ప నాయకులు ఉద్యమాలను ఎలా నిర్మించారో తెలుసుకోవాలని నాగేంద్రన్ సెటైర్లు వేశారు.
ఒక మనిషి కోడిని పట్టుకోవడాదనికి పైకప్పు ఎక్కలేకపోతే.. అతను స్వర్గానికి ఎలా చేరుకుంటాడు అంటూ విజయ్‌పై నాగేంద్రన్ సెటైర్లు వేశాడు. ప్రతిదానికీ అనుభవం అవసరం. ఎన్నికల రాజకీయాలకు అవసరమైన లోతు విజయ్‌కి లేదు. ఒక నటుడు కాబట్టి ఆయనకు 32 శాతం ఓటింగ్ వస్తుందని ఎలా అంగీకరిస్తాం? విజయ్‌కాంత్ ఒకప్పుడు భారీగా జనాన్ని ఆకర్షించలేదా? కానీ జనసమూహం ఓట్లుగా మారాలి. నేను కూడా హనుమంతుడి తీసుకొచ్చిన పర్వతం మీదకి దూకుతానని చెప్పగలను, కానీ అది సాధ్యమేనా? విజయ్ ఒక్క సీటు కూడా గెలవడని నాగేంద్రన్ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. మరి దీనిపై విజయ్ ఎలా స్పందిస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











