అజిత్ ఫ్యాన్స్‌కి మాటిచ్చి కమల్ హాసన్ మీద గెలిచింది.. ఇప్పుడు కొత్త టెన్షన్!
ఒక్కోసారి అనుకోకుండా చేసే పనులు కొన్ని తరువాత తిప్పలు తెచ్చి పెడతాయి. అలాగే ఇప్పుడు కొత్తగా ఎన్నికైన ఒక బీజేపీ ఎమ్మెల్యేకి కొత్త టెన్షన్ మొదలైంది. ఆమె మరెవరో కాదు వనతి శ్రీనివాసన్. ఎవరు ఈవిడ అనుకుంటున్నారా ? లోక నాయకుడు కమల్ మీద గెలిచి ఆమె తమిళనాట హాట్ టాపిక్ గా మారారు. అయితే అసలు విషయానికి వస్తే
అమేయ (అనన్య) క్యూట్ అండ్ గ్లామరస్ ఫొటోస్

లాయర్ టు ఎమ్మెల్యే
లాయర్ గా కెరీర్ ప్రారంభించి ఏకంగా కమల్ హాసన్ లాంటి చరిష్మా ఉన్న వ్యక్తి మీద గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు వనతి శ్రీనివాసన్. అయితే ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికైన సంగతి ఏమో గానీ ఇప్పుడు ఆమెకు అజిత్ ఫ్యాన్స్ నుంచి కొత్త టెన్షన్ పట్టుకుంది. దానికి ముఖ్య కారణం ఆమె ఎమ్మెల్యే ఎన్నిక కావడానికి ముందు అజిత్ ఫ్యాన్స్ కు ఇచ్చిన మాటే. కమల్ హాసన్ ను ఓడించిన బీజేపీ అభ్యర్థి వనతి శ్రీనివాసన్ కి ఇప్పుడు కొత్త టెన్షన్ పట్టుకుంది.

కమల్ ను ఎదుర్కొని మరీ
అన్నాడీఎంకే సహకారంతో బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన వనతి శ్రీనివాసన్ ఎన్నికల ప్రచారం సమయంలో సోషల్ మీడియా వేదికగా అజిత్ ఫ్యాన్స్ కు ఓ హామీ ఇచ్చారు. అంటే తాను గెలిస్తే వాలిమై సినిమా అప్డేట్ ఇప్పిస్తానని ఆమె చెప్పుకొచ్చింది. అసలు అలా ఎందుకు అన్నదో తెలియదు కానీ, ఒక రకంగా అజిత్ ఫ్యాన్స్ తనకు ఓటు వేస్తే... అతని తాజా చిత్రం 'వాలిమై'కు సంబంధించిన అప్ డేట్స్ ఇచ్చే ఆస్కారం ఉంటుందని ఆమె హింట్ ఇచ్చింది.

అజిత్ ఫ్యాన్స్ కి మాటిచ్చి
ఆమె సోషల్ మీడియాలో ఈ మేరకు పోస్ట్ చేయడంతో ఆ పోస్ట్ వల్ల ఆమెకు ఓట్లు వచ్చాయో లేదో తెలీదు. కానీ ఆమె ఎమ్మెల్యేగా గెలవడంతో ఇప్పుడు ఆమె పాత ట్వీట్ కిందే అజిత్ అభిమానులంతా... ఆమెకు అభినందనలు తెలియచేస్తూనే, ఆమె తమకు ఇచ్చిన హామీని గుర్తు చేసి మరీ ప్రశ్నిస్తున్నారు. 'అక్కా... మా అజిత్ సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఇస్తానన్నావు... ఆ విషయం ఏమైంది?' అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

అమ్మ పార్టీ కాదని మరీ
నిజానికి తమిళనాడు మాజీ సీఎం, స్వర్గీయ జయలలిత అంటే అజిత్ కు ఎంతో అభిమానం. అందుకే ఒకప్పుడు ఆయన అభిమానులు జయలలిత పార్టీ వైపు ఉండే వారు కానీ ఇప్పుడు అప్డేట్ ఇప్పిస్తామని చెప్పడంతో ఆయన ఫ్యాన్స్ అంతా ఇప్పుడు బీజేపీ నుంచి బరిలో దిగిన వనతి శ్రీనివాసన్ కే ఓటు వేసి ఉంటారని అంటున్నారు. అందుకే ఆమెను ఇప్పుడు పెద్ద ఎత్తున ఇప్పుడు అజిత్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. మరి ఆమె ఏమి చేస్తుందో వేచి చూడాలి మరి.
Recommended Video
వాలిమై ఫస్ట్ లుక్ కూడా లేట్
ఇక హెచ్. వినోద్ దర్శకత్వంలో అజిత్ హీరోగా 'వాలిమై' సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో అజిత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. దాదాపు చాలా వరకు సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి అజిత్ ఫస్ట్ లుక్ ను ఆయన పుట్టిన రోజు అంటే మే 1న రిలీజ్ చేస్తామని ముందు చెప్పారు. అయితే అనూహ్యంగా అది కూడా పోస్ట్ పోన్ చేశారు. ఈ విషయాన్ని నిర్మాత బోనీ కపూర్ తన ట్విట్టర్ ద్వారా ఆ మధ్య ప్రకటించారు.


Click it and Unblock the Notifications











