శభాష్: 'లింగ' టికెట్టుకు రక్తదానంతో లింకు

By Srikanya

హోసూరు: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ పుట్టిన రోజున ఆయన అభిమానులు డెంకణీకోట రోడ్డులోని అశోక్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఉదయం 7 గంటల నుంచి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ఆసుపత్రి నిర్వాహకులు తెలిపారు. రక్తదానం చేసే వ్యక్తులకు 12న లింగ చిత్ర ప్రదర్శనకు ఉచితంగా టికెట్టు ఇస్తామని నిర్వాహకులు తెలిపారు.

https://www.facebook.com/TeluguFilmibeat

ఈ రోజు(శుక్రవారం) విడుదల అవుతున్న రజినీకాంత్‌ నటించిన 'లింగ' చిత్రానికి అనుకోని అవాంతరం ఎదురైంది. 'లింగ' చిత్రకథ గతంలో చిరంజీవి నటించిన 'ఇంద్ర' కథనుపోలి ఉందంటూ ఓ తమిళ నిర్మాత చెన్నైలోని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇంద్ర చిత్రాన్ని తమిళంలో రీమేక్‌ చేసేందుకు బాలాజీ స్టుడియో పతాకంపై ఆ నిర్మాత హక్కులు పొందినట్లు సమాచారం.

Blood donation link with Linga ticket

ఈ నేపథ్యంలో తమ చిత్రకథను పోలి ఉందంటూ లింగాపై ఆ నిర్మాత కోర్టుకెక్కారు. ఈ కేసును ఈరోజు విచారించిన న్యాయస్థానం రూ. 5 కోట్లు నగదు, మరో రూ. 5 కోట్ల బ్యాంక్‌ డిపాజిట్‌ను సెక్యూరిటీగా సమర్పించమని 'లింగ' నిర్మాత రాక్‌లైన్‌ వెంకటేష్‌ను ఆదేశించింది. చిత్ర విడుదలకు మాత్రం న్యాయస్థానం ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు.

రజినీకాంత్‌, అనుష్క, సొనాక్షిసిన్హా ప్రధాన పాత్రలతో తెరకెక్కిన ఈ చిత్రానికి కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వం వహించారు. ఏ.ఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించారు. ఎన్నో విశేషాలతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని హీరో రజినీకాంత్‌ జన్మదినం సందర్భంగా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా 2000 వేలకు పైగా థియేటర్లలో విడుదల చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X