HBD Bobby Deol: క్రూరమైన విలన్‌గా స్టార్ హీరో.. సూర్యను ఢీకొట్టాలంటే తప్పదు మరి!

దక్షిణాదిలో చాలా తక్కువ మంది హీరోలు మాత్రమే దేశ వ్యాప్తంగా క్రేజ్‌ను సొంతం చేసుకుని సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో సహజసిద్ధమైన నటనతో ఆకట్టుకుంటోన్న కోలీవుడ్ స్టార్ సూర్య ఒకడు. చాలా కాలం నుంచి ప్రాంతీయ భాషా చిత్రాల్లోనే నటిస్తున్నా.. నేషనల్ రేంజ్‌కు ఎదిగాడు. ఈ ఉత్సాహంతోనే ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా రేంజ్ సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు తన 42వ సినిమాగా 'కంగువ'ను చేస్తున్నాడు. హై రేంజ్ యాక్షన్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి.

కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా.. మాస్ డైరెక్టర్ శివ తీస్తున్న చిత్రమే 'కంగువ'. పిరియాడిక్ బ్యాగ్‌డ్రాప్‌తో రాబోతున్న ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. ఇలా ఇప్పటికే ఎన్నో షెడ్యూళ్లను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. మొత్తంగా ఈ సినిమా టాకీ పార్టును చాలా వరకూ కంప్లీట్ చేశారు. మిగిలిన దాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసేలా ప్లాన్ చేసుకున్నారు. ఇలా ఈ చిత్రాన్ని వచ్చే ఏప్రిల్‌లో తీసుకు రావాలని ప్లాన్ చేస్తున్నారు.

Bobby Deol First Look Poster Released From Suriya Starrer Kanguva Movie

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'కంగువ' మూవీ నుంచి ఇప్పటి వరకూ కొన్ని పోస్టర్లతో పాటు ఓ గ్లింప్స్ వీడియో మాత్రమే వచ్చింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ చిత్రం నుంచి బాబీ డియోల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో ఈ బాలీవుడ్ స్టార్ 'ఉధిరన్' అనే పాత్రను చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇక, ఈ పోస్టర్‌లో బాబీ భయంకరమైన గెటప్‌తో కనిపించి షాకిచ్చాడు. అతడి చుట్టూ కొన్ని వందల మంది గిరిజన తెగకు చెందిన వాళ్లు కూడా కనిపించారు. దీంతో ఈ పోస్టర్‌కు భారీ రెస్పాన్స్ లభిస్తోంది.

ఇదిలా ఉండగా.. క్రేజీ కాన్సెప్టుతో రాబోతున్న 'కంగువ' మూవీలో దిశా పటానీ హీరోయిన్‌గా నటిస్తోంది. స్టూడియో గ్రీన్‌ పతాకంపై కేఈ జ్ఞానవేల్‌ రాజా, యువీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో యోగి బాబు కీలక పాత్రను పోషిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X