twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిక్కుల్లో మధుబాల ‘అగ్ని దేవి’... దర్శకుడిపై కోర్టు ధిక్కార కేసు వేసిన హీరో!

    |

    తమిళ నటుడు బాబీ సింహా ప్రధాన పాత్రలో రూపొందిన 'అగ్ని దేవి' వివాదంలో ఇరుక్కుంది. తాను ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న తర్వాత తనలాగా ఉండే డూప్‌తో సినిమా చిత్రీకరించారని, విఎఫ్ఎక్స్ మాయాజలంతో తాను నటించినట్లు భ్రమకల్పించారంటూ బాబీ సింహా కొంతకాలంగా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా విడుదల కాకుండా కోర్టు స్టే తెచ్చినా పట్టించుకోకుండా దర్శక నిర్మాతలు సినిమా విడుదల చేయడంతో బాబీ సింహా కోర్టు ధిక్కార కేసు వేశారు.

    రిలీజ్ తర్వాత ముదిరిన వివాదం

    రిలీజ్ తర్వాత ముదిరిన వివాదం

    సినిమా రిలీజ్ కాకుండా స్టే ఆర్డర్ కాపీలు దర్శకక నిర్మాతలకు పంపినట్లు ఈ కేసును హ్యాండిల్ చేస్తున్న లాయర్ ఇకప్పటికే తెలిపారు. అయితే సినిమాపై స్టే కొనసాగుతుండగానే దర్శక నిర్మాతలు సినిమాను మార్చి 22న విడుదల చేయడంతో వివాదం మరింత ముదిరింది.

    కోర్టు ధిక్కార కేసు

    కోర్టు ధిక్కార కేసు

    అయితే కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా దర్శకుడితో పాటు చిత్ర బృందం మూవీ విడుదల చేయడంతో దర్శకుడు జాన్ పాల్రాజ్ మీద ‘కోర్టు ధిక్కారం' కేసు వేశారు బాబీ సింహా. ‘ఈ కేసు సోమవారం (మార్చి 25) విచారణకు వస్తుందని, జాన్ పాల్రాజ్, అతడి తరుపు వ్యక్తులు కోర్టుకు హాజరు కాని పక్షంలో శిక్షింపబడతారని' లాయర్ సుందరరామన్ తెలిపారు.

    అగ్ని దేవి

    అగ్ని దేవి

    ‘అగ్ని దేవి' చిత్రం తమిళనాడు వ్యాప్తంగా మార్చి 22న విడుదలైంది. అయితే ఈ చిత్రానికి అటు విమర్శకుల నుంచి, ఇటు ఆడియన్స్ నుంచి నెగెటివ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా రెగ్యులర్ రివేంజ్ డ్రామా అని, క్లైమాక్స్ చెత్తగా ఉందనే కామెంట్స్ వచ్చాయి.

    క్రియేటివ్ డిపరెన్సెస్ వల్ల తప్పుకున్న బాబీ సింహా

    క్రియేటివ్ డిపరెన్సెస్ వల్ల తప్పుకున్న బాబీ సింహా

    ‘అగ్నిపూలు' సినిమా షూటింగ్ ప్రారంభమైన 5 రోజుల్లోనే క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల తాను ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లు బాబీ సింహా తన ఫిర్యదులో పేర్కొన్నారు. నా దగ్గర నుంచి ఎలాంటి అనుమతి లేకుండా డూప్ యాక్టర్‍‌తో షూటింగ్ కంప్లీట్ చేసి విఎఫ్ఎక్స్ మాయాజాలంతో తాను నటించినట్లు చూపించారని బాబీ సింహా ఆరోపిస్తున్నారు.

    మధు బాల రీఎంట్రీ

    మధు బాల రీఎంట్రీ

    కాగా.. ‘అగ్ని దేవి' సినిమా ద్వారా రోజా మూవీ ఫేం మధు బాలా తమిళ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మధుబాలతో పాటు రమ్య నంబీవన్, సతీష్ ముఖ్య పాత్రలు పోషించారు.

    English summary
    Reportedly, Bobby had obtained a stay order against John Paulraj's Agni Devi. According to the lawyer handling the case, they had sent the copy of stay order to everyone concerned. However, the director and team managed to release the film without paying heed to the court's order. Now, Bobby is said to have filed for contempt of court against the director.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X