విక్రమ్ సినిమాలో బాబీ సింహా.. అదిరిపోయే రోల్ అంటూ పోస్ట్
కోలీవుడ్‌లో ఫుల్ డిమాండ్ ఉన్న నటీనటుల్లో బాబీ సింహ ఒకరు. విలన్, హీరో, సపోర్టింగ్ రోల్ ఇలా ఏదైనా సరే తనదైన ముద్ర వేసేలా నటిస్తుంటాడు బాబీ సింహా. కోలీవుడ్‌లో ఇతని డిమాండ్, క్రేజ్ చూసిన తెలుగు దర్శక నిర్మాతలు షాక్ అయ్యారు. అందుకే బాబీ సింహాను ఏరి కోరి మరీ తీసుకొచ్చుకుంటున్నారు. అలా రవితేజ డిస్కో రాజా సినిమాలో విలన్ రోల్‌లో కనిపించాడు. ఇక డబ్బింగ్ సినిమాలతోనూ బాబీ సింహా సుపరిచితుడే.
బాబీ సింహా, విజయ్ సేతుపతి, కార్తీక్ సుబ్బరాజ్ ఇలా ఈ అందరూ ఫ్రెండ్స్. సినిమా ప్రయత్నాలు చేస్తున్న సమయం నుంచే ఈ ముగ్గురూ స్నేహితులే. ఒకరి చిత్రాల్లో ఒకరు క్యారెక్టర్స్ ఆఫర్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అలా కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన పిజ్జాలో విజయ్ సేతుపతి, జిగర్తాండ చిత్రంలో బాబీ సింహా నటించి స్టార్డంను సంపాదించుకున్నారు. ఇప్పుడు కార్తిక్ సుబ్బరాస్ చియాన్ విక్రమ్ 60వ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇందులో విక్రమ్‌ను ఢీ కొట్టే పాత్రలో బాబీ సింహా కనిపించబోతోన్నాడు. ఈ మేరకు తాజాగా అధికారికంగా ఓ ప్రకటనను విడుదల చేశారు. విక్రమ్, ధృవ్ విక్రమ్ కలిసి నటిస్తోన్న ఈ చిత్రంలో బాబీ సింహా కూడా ఓ రోల్ పోషిస్తోన్నట్టు చేసిన ఈ ప్రకటన ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. సంతోష్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ ఈ మూవీని నిర్మిస్తోంది.


Click it and Unblock the Notifications











