లోకేష్ కనగరాజ్ పై పీకల దాకా కోపం.. ఆ మేటర్ బయట పెట్టిన బాలీవుడ్ స్టార్

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి దర్శకులు, నటులు ఇండియాను షేక్ చేసే సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి మొదలు.. పుష్ప, విక్రమ్, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్, సలార్, కల్కి 2898ఏడీ వంటి చిత్రాలు విడుదలై ప్రపంచ వ్యాప్తంగా దక్షిణాది చిత్రాల సత్తా చాటిన సంగతి తెలిసిందే. అయితే విక్రమ్, లియో వంటి చిత్రాలతో యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఇండియాలో టాప్ డైరెక్టర్ గా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీ అవుతున్నారు. అయితే తాజాగా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. అతనిపై కోపంగా ఉన్నానంటూ వ్యాఖ్యానించడం షాకింగ్ గా మారింది. ఎందుకు? ఏంటనే? వివరాల్లోకి వెళితే..

సంజయ్ దత్ తో కోలీవుడ్ డైరెక్టర్..
బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ తొలుత కన్నడ బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ కేజీఎఫ్ తో దక్షిణాది చిత్రాల్లోకి అడుగు పెట్టారు. అప్పటి వరకు బాలీవుడ్ లో దుమ్ములేపిన సంజయ్ దత్ కేజీఎఫ్ తర్వాత నుంచి సౌత్ లోని బిగ్ ప్రాజెక్ట్స్ ల్లో నటిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి - లోకేష్ కనరాజ్ కాంబినేషన్ లో వచ్చిన లియో చిత్రంలో విలన్ పాత్రను పోషించారు. తాజాగా ఈ సినిమాలో తనను దర్శకుడు లోకేష్ కనగరాజ్ చూపించిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

Bollywood Actor Angry on Lokesh Kanagaraj

సంజయ్ దత్ లేటెస్ట్ కామెంట్స్..
ప్రస్తుతం సంజయ్ దత్ కేడీ ది ఎవిల్ అనే కన్నడ చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే తాజాగా సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలైంది. ఆ ఈవెంట్ లో సంజయ్ దత్ పాల్గొని మాట్లాడారు. ఈ క్రమంలో లోకేష్ కనగరాజ్ గురించి ప్రస్తావించారు. 'గతంలో దళపతి విజయ్ తో కలిసి పనిచేశాను. నాకు చాలా నచ్చింది. కానీ లోకేష్ కగనరాజ్ నాకు ప్రాధాన్యత లేని పాత్రను ఇచ్చారు. ఇంకా పవర్ ఫుల్ రోల్ ఇచ్చి ఉంటే బాగుండేది. ఆ విషయంలో నేను అతనిపై కోపం(నవ్వుతూ)గా ఉన్నాను.' అని చెప్పుకొచ్చారు.

ఇక లియో చిత్రం 2023 అక్టోబర్ 19న పాన్ ఇండియా చిత్రంగా విడుదలైంది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. విజయ్ దళపతి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఆంటోనీ దాస్ పాత్రలో అలరించారు. త్రిష కృష్ణన్ హీరోయిన్. ఇక సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ లో నిర్మాత ఎస్ఎస్ లలిత్ కుమార్, జగదీశ్ పళానిస్వామి నిర్మించారు. రూ.300 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.620 కోట్ల వరకు గ్రాస్ వసూల్ అందుకుంది.

సంజయ్ దత్ నెక్ట్స్..
తెలుగులోనూ సంజయ్ దత్ డబుల్ ఇస్మార్ట్ శంకర్ లో నటించారు. పూరీ జగన్నాథ్ - రామ్ పోతినేని కాంబినేషన్ లో ఆ చిత్రం రూపుదిద్దుకున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం తెలుగులో బాలయ్య అఖండ 2, ప్రభాస్ ది రాజా సాబ్ వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. హిందీలో దురంధర్, బాప్, కన్నడలో ది - ది డెవిల్ అనే చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X