నటుడు అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు
చెన్నై: తమిళ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపులు వచ్చాయి. శనివారం తెల్లవారు ఝామున గుర్తు తెలియని వ్యక్తులు అతని ఇంటికి ఫోన్ చేసి బాంబు ఉందని బెదరించారు. దీంతో బాంబ్ స్వ్కాడ్ రంగంలోకి దిగి బాంబు కోసం వెతికారు. అయితే ఎలాంటి బాంబు దొరక లేదు.
అయితే ఈ బెదిరింపుల వెనక కారణం ఏంటనే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఇది ఎవరైనా కావాలని చేసారా? లేక ఆకతాయి పనా అనే దానిపై విచారణ జరుపుతున్నారు. ఫోన్ కాల్ ఎక్కడి నుండి వచ్చింది? ఎవరు ఈ చర్యకు పాల్పడిందనే దానిపై ఆరా తీస్తున్నారు.

ప్రస్తుతం అజిత్ 'తాళ 55' షూటింగులో బిజీగా ఉన్నారు. బాంబు బెదిరింపుల విషయం తెలియగానే అజిత్ అభిమానులు అంతా ఒక్కసారిగా కలవరానికి గురయ్యారు. అయితే బాంబు లేదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. న్యూస్ టుడే జర్నలిస్టు ద్వారా ఈ బాంబు బెదిరింపుల విషయం వెలుగులోకి వచ్చింది.


Click it and Unblock the Notifications











