అజిత్ నివాసానికి బాంబు బెదిరింపు.. ఇంటిని పేల్చివేస్తామని అగంతకుడి ఫోన్‌కాల్
తమిళ సూపర్‌స్టార్ అజిత్ ఇంటిని పేల్చివేస్తామని అగంతకులు బెదిరింపులకు పాల్పడటం కోలీవుడ్‌లో కలకలం రేపింది. బెదిరింపు కాల్‌తో అప్రమత్తమైన పోలీసులు వెంటనే తనిఖీలు చేపట్టారు. దాంతో కొద్ది గంటలపాటు స్థానికంగా, మీడియాలో ఈ వార్త హంగామా సృష్టించింది. ఏం జరుగుతుందనే భయంతో అభిమానులు కంగారు పడిపోయారు. ఈ బాంబు బెదిరింపు అంశంలో వివారాల్లోకి వెళితే. .
పోలీసుల కథనం ప్రకారం.. జూలై 18 తేదీ శనివారం ఉదయం పోలీస్ కంట్రోల్ రూమ్‌కు అగంతకులు కాల్ చేశారు. ఇంజమ్‌బాకంలోని అజిత్ నివాసంలో బాంబులు పెట్టాం. ఆ ఇంటిని పేల్చివేస్తాం అని ఫోన్ కాల్‌లో బెదిరించారు. ఆ వెంటనే కాల్ కట్ చేశారు. ఫోన్ కాల్ రాగానే అజిత్ ఫ్యామిలీని అలర్ట్ చేసి హెచ్చరించాం. వెంటనే అజిత్ నివాసానికి చేరుకొన్నాం అని తెలిపారు.

అజిత్ ఇంటిలో రెండు గంటలపాటు సోదాలు
అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు రావడంతో చెన్నై పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే బాండ్ స్క్వాడ్ అజిత్ నివాసానికి చేరుకొని ఇంటిలో సోదాలు నిర్వహించారు. దాదాపు రెండు గంటలపాటు సోదాలు నిర్వహించారు. ఆ తర్వాత బాంబు బెదిరింపు కాల్‌లో వాస్తవం లేదనే నిర్ణారణకు వచ్చారు. దాంతో అభిమానులు, స్థానికులకు ఊపిరి పీల్చుకొన్నారు.

విల్లుపరం జిల్లా నుంచి కాల్
అజిత్ ఇంటిని పేల్చివేస్తామని వచ్చిన ఫోన్ కాల్ గురించి ఆరా తీయగా.. తమిళనాడులోని విల్లుపురం జిల్లాలోని ఓప్రాంతం నుంచి వచ్చినట్టు గుర్తించారు. ఆ ప్రాంతం నుంచి ఎవరు కాల్ చేశారనే విషయాన్ని దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే భూటకపు కాల్ చేసిందేవరనే విషయాన్ని గుర్తించి అగంతకులను అదుపులోకి తీసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు.

గతంలో రజనీ, విజయ్ ఇంటికి బాంబు బెదిరింపు
గతంలో రజనీకాంత్, విజయ్ ఇంటిని పేల్చివేస్తామని విల్లుపురంకు చెందిన భువనేష్ కాల్ చేసినట్టు పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే. ఆ వ్యక్తి గురించి ఆరా తీయగా మానసిక రుగ్మతతో బాధపడుతున్న పేషంట్ అని గుర్తించారు. అయితే అజిత్ ఇంటిని పేల్చివేస్తామని వచ్చిన బెదిరింపు కాల్ భువనేష్ నుంచి వచ్చిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Recommended Video

బోనికపూర్ నిర్మించే చిత్రంలో
అజిత్ కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్న వాలిమై చిత్రంలో నటిస్తున్నారు. బాలీవుడ్ నిర్మాత బోనికపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ కరోనావైరస్ లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. త్వరలోనే పరిస్థితులను బట్టి షూటింగ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











