అది శ్రీదేవి కోరిక.. అందుకే చేయాల్సి వచ్చింది.. బోనీ కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దివంగత నటి, అందాల తార శ్రీదేవి కోరిక మేరకే తాను నెర్కొండ పార్వై సినిమాను రూపొందించాల్సి వచ్చిందని అంటున్నారు ఆమె భర్త బోనీ కపూర్. డిఫరెంట్ జోనర్‌లో సమాజంలో మహిళా ప్రాధాన్యం తెలిపేలా ఉన్న 'పింక్' చిత్రాన్ని చూసిన శ్రీదేవి ఈ సినిమాను రీమేక్ చేయమని భర్త బోనీ కపూర్‌ని కోరిందట. ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్న నెర్కొండ పార్వై ప్రమోషన్స్ లో భాగంగా శ్రీదేవికి సంబందించిన పలు ఆసక్తికర విషయాన్ని చెప్పారు బోనీ కపూర్.

'పింక్' తమిళ రీమేక్
బాలీవుడ్ లో భారీ సక్సెస్ సాధించిన పింక్ సినిమాను తమిళంలో రీమేక్ చేస్తున్నారు బోనీ కపూర్. ఈ సినిమాకు 'నెర్కొండ పార్వై' అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు. సమాజంలోని మహిళా విలువలు తెలిపేలా ఈ సినిమా కథాంశం ఉంటుంది. వినోద్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

రుణం తీర్చుకుంటున్నా అంటూ బోనీ కపూర్
ప్రస్తుతం నెర్కొండ పార్వై ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న బోనీ కపూర్ ఈ సినిమా ద్వారా తమిళ సినీ పరిశ్రమ రుణం తీర్చుకుంటున్నా అని అన్నారు. అయితే తాను ఈ తమిళ చిత్రాన్ని రూపొందించడం వెనుక తన భార్య శ్రీదేవి ఉందని బోనీ కపూర్ వెల్లడించారు. పింక్ సినిమా చూసి ఈ సినిమాను తమిళ్ అజిత్ తో చేయమని ఆమె తనను కోరినట్లుగా బోనీ చెప్పారు.

గతంలో నేను, శ్రీదేవి చెన్నై వచ్చినప్పుడు అజిత్
ఈ సందర్భంగా హీరో అజిత్ తో శ్రీదేవికి, తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు బోనీ. అజిత్ చాలా ఉదారస్వభావం కలిగిన వ్యక్తి అలాగే చాలా సపోర్టివ్ కూడా అని అన్నారు బోనీ కపూర్. గతంలో తాను, శ్రీదేవి చెన్నై వచ్చినప్పుడు అజిత్‌ను కలిశామని.. అప్పుడే అజిత్ తో ‘పింక్' గురించి మాట్లాడామని చెప్పారు. శ్రీదేవి కోరిక మేరకు అజిత్ ఈ సినిమా చేసేందుకు ఒప్పుకున్నారని ఆయన అన్నారు.

తప్పును సరిదిద్దుకుని అజిత్
కెరీర్ స్టార్టింగ్‌లో తాను మహిళలను ఇబ్బందిపెట్టే తరహాలో సాగే కొన్ని పాత్రలు చేసి పొరపాటు చేశానని.. కానీ తప్పును సరిదిద్దుకుని ఇప్పుడు నెర్కొండ పార్వై అనే మహిళా ప్రాధాన్యత గల సినిమాలో నటించడం ఆనందంగా ఉందని అజిత్ గత మీడియా సమావేశంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. అతి త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











