twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అజిత్‌ను బోనీ కపూర్ వదలేలా లేడుగా.. కోలీవుడ్‌లో ఇప్పుడిదే చర్చ

    |

    తమిళ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు అజిత్ కుమార్. స్టైలిష్ లుక్, విలక్షణమైన నటనతో అశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే, ఈ మధ్య అతడు చేసిన సినిమాలేవీ పెద్దగా ఆడడం లేదు. దీంతో అజిత్ ఫ్యాన్స్ నిరాశకు లోనవుతున్నారు. వరుస పరాజయాల తర్వాత అజిత్ నటించిన చిత్రం 'నెర్కొండ పార్వాయి'.

    బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్ - తాప్సీ పన్ను కలయికలో వచ్చిన చిత్రం 'పింక్'కు ఇది రీమేక్‌గా వచ్చింది. దీన్ని శ్రీదేవి భర్త బోనీ కపూర్ నిర్మించారు. ఖాకీ ఫేం హెచ్ వినోథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. శ్ర‌ద్ధా శ్రీనాథ్‌, అభిరామి వెంక‌టచ‌లం, ఆండ్రియా తరియంగ్‌లు ముఖ్య పాత్ర‌లలో క‌నిపించారు. అలాగే, బాలీవుడ్ బ్యూటీ విద్యా బాలన్ కూడా ఓ అతిథి పాత్రలో కనిపించారు.

    Boney Kapoor Will Produce Article 15 Remake With Ajith Kumar

    వ్యభిచార గృహాల్లో చిక్కుకున్న ముగ్గురు యువతులను రక్షించే న్యాయవాది ఇతివృత్తంగా త‌మిళ నేటివిటీకి అనుగుణంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. కొద్దిరోజుల క్రితం విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదలైన మొదటి రోజే చెన్నైలో భారీ వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డులకెక్కింది. అలాగే, భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న అజిత్‌.. ఈ సినిమా ఫలితంతో ఖుషీగా ఉన్నాడు.

    దీని తర్వాత అజిత్.. బోనీ కపూర్ నిర్మాణంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. యంగ్ డైరెక్టర్ వినోద్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అజిత్ బైక్‌ రెసర్‌గాను, నడి వయస్సు పాత్రలో నటించనున్నారు. ఈ సినిమా పట్టాలపై ఉండగానే ఆయన మరో సినిమాక పచ్చ జెండా ఊపారని టాక్.

    ఆయుష్మాన్‌ ఖురానా హీరోగా అనుభవ్‌ సిన్హా దర్శకత్వంలో ఘన విజయం సాధించిన 'ఆర్టికల్‌ 15'ను తమిళంలో రీమేక్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఇందులోనే అజిత్ నటిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఈ సినిమాను కూడా బోనీ కపూరే నిర్మిస్తారట. ఇప్పటికే ఈ సినిమా రీమేక్ హక్కులను ఆయన కొనుగోలు చేశారని అంటున్నారు.

    English summary
    Fresh rumor on social media is that Thala Ajith has been approached to play the lead role in the Tamil remake of Ayushmann Khurrana's critically acclaimed hit film 'Article 15'.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X