twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రజనీకాంత్ తో పోటీకి వస్తున్న మరో స్టార్ హీరో.. అలా అయితే రిస్క్ చేసినట్లే..

    |

    కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోల మధ్య పోటీ నెలకొంది అంటే అభిమానుల మధ్య వాతావరణం ఒక్కసారిగా వేడెక్కుతోంది. సోషల్ మీడియా వచ్చిన తరువాత అయితే ఆ గొడవల తీవ్రత మరింత ఎక్కువైంది. ట్రోలింగ్స్ చేయడంలో హద్దులు దాటేస్తున్నారు. ఇక అజిత్, విజయ్ వంటి స్టార్ హీరోల అభిమానుల మధ్య ప్రతిసారి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అజిత్ కు ఇటీవల కాలంలో నెగిటివ్ ఫ్యాన్స్ ఎక్కువయ్యారనే చెప్పాలి.

    ఇక త్వరలోనే రజనీకాంత్ కూడా పోటీకి వస్తుండడంతో అజిత్ మరో రిస్క్ చేస్తున్నట్లు టాక్ వస్తోంది. సూపర్ స్టార్ నెక్స్ట్ అన్నత్తై సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా దీపావళి సందర్భంగా విడుదల కానున్నట్లు ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు. ఇక అజిత్ వాలిమై కూడా అదే తేదీకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను బోణి కపూర్ నిర్మిస్తుండగ టాలెంటెడ్ దర్శకుడు హెచ్.వినోథ్ డైరెక్ట్ చేస్తున్నాడు.

    Box office fight between rajanikanth with another star hero

    అజిత్, రజనీకాంత్ ఇద్దరికి కూడా తమిళనాడులో భారీ మార్కెట్ ఉంది. ఈజీగా ఇద్దరు చెరో 100కోట్ల బాక్సాఫీస్ రికార్డును అందుకోగలరు. అయితే ఫొటో పడితే మాత్రం ఆ కలెక్షన్స్ పై ప్రభావం ఎంతో కొంత పడుతుంది. ముఖ్యంగా అజిత్ ఈసారి రజనీకాంత్ ఫ్యాన్స్ నుంచి కూడా తీవ్ర స్థాయిలో ట్రోలింగ్స్ ఎదుర్కోవడం కాయమని టాక్ వస్తోంది. అయితే కోలీవుడ్ ఇండస్ట్రీకి దీపావళి లక్కీ ఫెస్టివల్ అని చెప్పవచ్చు. ఎలాంటి పెద్ద హీరో సినిమా అయినా సరే ఆ టైమ్ లో భారీ వసూళ్లను అందుకోగలవు. మరి అజిత్, రజనీకాంత్ ఇద్దరిలో ఎవరు అత్యదిక వసూళ్లను అందుకుంటారో చూడాలి.

    English summary
    It is known that superstar Rajinikanth did not want to go into politics and eventually dropped out. But the big budget movie that closed that route and started immediately is annaatthe. It seems that Taliva is going to appear in a different style in this movie which is being screened by commercial mass director Shiva. It seems that Shiva, who mostly prepares the script for the masses to blow the whistles, is about to hit the ground running again.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X