twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నమ్మండి.. .నేనూ 'బ్రూస్‌లీ'నే! అంటున్నాడు

    By Srikanya
    |

    చెన్నై : వర్ధమాన దర్శకుడు ప్రశాంత్‌ దర్శకత్వంలో ప్రస్తుతం జీవీ ప్రకాశ్‌ నటిస్తున్న చిత్రం 'బ్రూస్‌లీ'. కృతి కర్బందా హీరోయిన్. 'నానుం రౌడీదాన్‌' చిత్రంలో విజయ్‌ సేతుపతి తానూ ఓ రౌడీనేనని బిల్డప్‌ ఇచ్చుకునేలా.. ఇందులో తానూ బ్రూస్‌లీనే అంటూ చక్కర్లు కొట్టే పాత్రను పోషిస్తున్నారు జీవీ ప్రకాశ్‌. ఇందులో ఆయన మన్సూర్‌ అలీఖాన్‌ అభిమానిగా నటిస్తున్నారు.

    మన్సూర్‌ అలీఖాన్‌ సినిమా విడుదలవుతున్న సందర్భంగా ఓ థియేటర్‌ వద్ద బ్యానర్లు ఏర్పాటు చేసి పాలాభిషేకం చేసే సన్నివేశాలను కూడా తెరకెక్కించనున్నారు. నవంబరు తొలివారం నుంచి చిత్రీకరణ ఆరంభం కానుంది. ఇటీవలే ఈ సినిమా ఫొటోషూట్‌ను నిర్వహించారు. జీవీ ప్రకాశ్‌, కృతి కర్బందాల జోడీ బాగుందని చిత్రవర్గాలు చెబుతున్నాయి. కెనన్య ఫిలిమ్స్‌ బ్యానరుపై సెల్వ నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడిగా పలు హిట్లను సొంతం చేసుకున్న జీవీ.. ఈ సినిమాతో హ్యాట్రిక్‌ సాధిస్తాడేమో వేచి చూడాల్సిందే.

    'త్రిష ఇల్లనా నయనతార' సినిమా కమర్షియల్‌గా ఘనవిజయం సాధించినప్పటికీ.. పలు విమర్శలను ఎదుర్కోక తప్పలేదు జీవీ ప్రకాశ్‌. హీరోగా వరుసగా రెండు హిట్లను సొంతం చేసుకున్న ఆయన.. ఈ విషయాలను ఏమాత్రం పట్టించుకోకుండా మూడో హిట్‌ను అందించేందుకు సిద్ధమయ్యారు.

    'డార్లింగ్‌', 'త్రిష ఇల్లనా నయనతార' చిత్రాల కమర్షియల్‌ విజయాలతో తన సత్తా చాటుకున్నారు జీవీ ప్రకాశ్‌. సంగీత దర్శకత్వం నుంచి హీరోగా మారిన ఈ కుర్రాడు.. హీరోగా కూడా గుర్తింపు తెచ్చుకోవడం విశేషం. ఆయన నటించిన 'పెన్సిల్‌' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో వరుసగా కొత్త సినిమాల్లో నటించేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు జీవీ.

     ‘Bruce Lee’: GVPrakash acting as Manzoor alikhan fan

    తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం 'బ్రూస్‌లీ'. 'పసంగ' పాండిరాజ్‌ వద్ద సహాయకుడిగా పనిచేసిన ప్రశాంత్‌ పాండిరాజ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కెనన్యా ఫిలిమ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. చిత్ర పూజా కార్యక్రమం చెన్నైలో ఘనంగా జరిగింది.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    కామెడీ థ్రిల్లర్‌, యాక్షన్‌ చిత్రంగా 'బ్రూస్‌లీ'ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో జీవీప్రకాశ్‌ పాత్ర పేరు బ్రూస్‌లీ. జీవీ ప్రకాశ్‌ రూపాన్ని చూసి మిగిలిన యువకులు హేళనగా అలా పిలుస్తారట.. అందుకే చిత్రానికి బ్రూస్‌లీ అని పేరుపెట్టారు. కృతి కర్బందా హీరోయిన్.

    ఇక దర్శకుడి విషయానికొస్తే.. పాండిరాజ్‌ తెరకెక్కిస్తున్న 'హైకూ', 'ఇదు నమ్మ ఆళు' సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేశారు. అంతేకాకుండా 'నాలయ ఇయక్కునర్‌' సీజన్‌-4లో పాలుపంచుకుని తన ప్రతిభను చాటుకున్నారు.

    తన గురువు పాండిరాజ్‌ మాదిరిగానే ఈ సినిమాను కూడా పెద్దలతో పాటు చిన్నారులకు మరింత నచ్చేలా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. నవంబరు నుంచి చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఇతర నటీనటుల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది.

    రామ్ చరణ్ తాజా చిత్రం ‘బ్రూస్ లీ' తమిళంలోనూ అదే రోజు ‘బ్రూస్ లీ 2' టైటిల్ తో విడుదలకు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ టైటిల్ వివాదంలో పడింది. తమిళంలో ఇదే టైటిల్ తో సంగీత దర్శకుడు జివి ప్రకాష్ హీరోగా రూపొందిన థ్రిల్లర్ చిత్రం ‘బ్రూస్ లీ' కూడా వస్తోంది. ఇందులోనూ కృతి కర్భందే హీరోయిన్. దాంతో ఇప్పుడు వివాదం మొదలైంది. ఈ టైటిల్ తమ చిత్రానికి డైరక్ట్ గా పెద్ద దెబ్బకొట్టినట్లే అంటున్నారు తమిళ నిర్మాత, దర్శకుడు. ఈ మేరకు వారు తమిళ ఫిల్మ్ ఛాంబర్ లో ఫిర్యాదు చేసారు.

    నిర్మాత సెల్వ కుమార్ మాట్లాడుతూ..., "మాకు దయచేసి ‘బ్రూస్ లీ' టైటిల్ ని వదిలేయండి. ‘బ్రూస్ లీ2 ' అంటూ ఇంకో టైటిల్ తో వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు. మొదట మేమే టైటిల్ ని రిజిస్టర్ చేసుకుని పబ్లిసిటీ మొదలుపెట్టాం. తెలుగులో వారు ఏం టైటిల్ పెట్టుకున్నాం మాకు ఇబ్బంది లేదు. తమిళ డబ్బింగ్ టైటిల్ మాత్రం మార్చమంటున్నాం. వారు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ లో రిజిస్టర్ చేసారని తెలిసింది. మేము అక్కడే చేసాం. అలా ఎలా రెండు టైటిల్స్ రిజిస్టర్ చేసి ఫర్మిషన్ ఇచ్చారో మాకు తెలియటం లేదు. ఈ విషయమై తమిళ నిర్మాతల మండలిలో మేము ఫిర్యాదు చేస్తున్నాం. మాకు న్యాయం జరుగుతుందని నమ్మకం ఉంది" అన్నారు.

    English summary
    GV Prakash’s next project is titled as ‘Bruce Lee’ and the movie will be funded by Kenanya Films banner. Prakash himself will be scoring the music for this project. ‘Mundasupatti’ fame Shankar will handle the cinematography portion and Prashanth Pandiraj is making his debut as director. Now regarding the movie Director Prashanth says, “There is a reason behind the title ‘Brucelee’. GV Prakash’s character nick name is ‘Bruce Lee’ in the movie. Story behind the name forms crux of the plot. Film is a black comedy and it will be in lines of ‘Jigarthanda’. The movie will run on novelty of its screenplay and the makers are still looking for a suitable female lead. We will confirm the female lead soon. Shooting is progressing at a decent pace.”
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X