twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సెన్సార్ బోర్డునే షేక్ చేస్తున్న సెక్సీ పాపలు

    By Bojja Kumar
    |

    ఆ ఇద్దరు హీరోయిన్ల ధాటికి సెన్సార్ బోర్డే షేక్ అయి పోయిందట. ఆ రేంజింలో సెక్సీగా తమ అందాలను ఆరబోశారు మరి. వాళ్లెవరో కాదు...అజిత్ హీరోగా వస్తున్న 'డేవిడ్ బిల్లా' చిత్రంలోని హీరోయిన్లు బ్రూనా అబ్దుల్లా, పార్వతి ఓమన కుట్టన్‌లు. ఇటీవల సెన్సార్ బోర్డు పరిశీలకు వెళ్లిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు వారు 40 చోట్ల కత్తెర పెట్టి మరీ 'A' సర్టిఫికెట్ ఇచ్చారు. ఇందులో ఈ ఇద్దరు భామలు హాట్ హాట్‌గా రెచ్చిపోయిన సీన్లే ఎక్కువగా ఉన్నాయిట. మిగతావి మితిమీరిన హింసతో కూడిన సీన్లు ఉన్నట్లు తెలుస్తోంది.

    అన్ని కత్తెరలు పెట్టి మరీ 'A' సర్టిపికెట్ ఇవ్వడంపై 'డేవిడ్ బిల్లా' దర్శక నిర్మాతలు అసంతృప్తిగా ఉన్నారు. యు/ఎ సర్టిఫికెట్ పొందడం కోసం ముంబై సెన్సార్ రివ్యూ కమిటీని ఆశ్రయించనున్నరని సమాచారం. ఈ నేపథ్యంలో ఈ నెల 29న విడుదల కావాల్సిన చిత్రం మరింత ఆలస్యం అయ్యే అవకాశం కూడా ఉందంటున్నారు. మరి ఏం జరుగబోతోందో..వెయిట్ అండ్ సీ.

    చక్రి తోలేటి దర్శకత్వంలో అజిత్, పార్వతి ఓమనకుట్టన్, బ్రుణ అబ్దుల్లా ప్రధాన పాత్రలలో రాబోతున్న చిత్రం "డేవిడ్ బిల్లా". తమిళ్ంలో 'బిల్లా 2' రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో శోభా రాణి ఎస్‌వి‌ఆర్ మీడియా ప్రై.లి బ్యానర్ మీద నిర్మిస్తున్నారు.

    ఈచిత్రానికి శేఖర్ రాజా ఫోటోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. యువన్ శంకర్ రాజా ట్రెమండస్ మ్యూజిక్‌ను అందించారు. పెద్ద టెక్నీషియన్స్ అంతా ఈ సినిమాకి పని చేయడం సినిమా బాగా రావడానికి కారణం అయిందని నిర్మాత చెప్పారు. "డేవిడ్ బిల్లా" తమిళ "బిల్లా" చిత్రానికి ప్రీక్వెల్ బిల్లా పాత్ర ఎక్కడ మొదలయ్యింది అనేది కథాంశం. యువన్ శనకర్ రాజ సంగీతం అందించిన ఈ చిత్రానికి చక్రి తోలేటి దర్శకత్వం వహించారు.

    English summary
    Ajith’s upcoming flick ‘David Billa’ (‘Billa 2’ in Tamil) has got nearly 40 cuts recommended by Regional Censor Board. Reports say, majority of these cuts were related to overt skin show offered by heroines Bruna Abdullah and Parvathy Omanakuttan. Of course, there is also high dose of violence canned by director Chakri Toleti for this prequel film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X