»   » సినీ నటిపై బస్సు డ్రైవర్, క్లీనర్...అసభ్య ప్రవర్తన!

సినీ నటిపై బస్సు డ్రైవర్, క్లీనర్...అసభ్య ప్రవర్తన!

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: సినిమా స్టార్స్ జనాల్లోకి వస్తే ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవడం తరచూ చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ వర్దమాన సినీనటిని బస్సు డ్రైవర్, క్లీనర్ దుర్భాషలాడిన సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. దీంతో ఆమె ఈరోడ్ డీఎస్పీకి ఫిర్యాదు చేసారు. అమ్నీ బస్సు సర్వీసులో ఈ సంఘటన చోటు చేసుకుంది.

ఈ నెల 26న చెన్నై నుంచి ఆమ్నీ బస్సులో ఈరోడ్‌ కు బయల్దేరిన విజయకుమారి...తాను కూర్చున్న సీటు వద్ద ఆ బస్సు ఏసీ నుంచి నీరు కారుతూ, చలి అధికంగా ఉండటంతో కప్పుకునేందుకు దుప్పటి ఇవ్వని బస్‌ డ్రైవర్‌, క్లీనర్‌లను అడిగింది. దీంతో వారు తనను దుర్భాషలాడినట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Bus driver's abusive behavior on actress

డ్రైవర్‌, క్లీనర్‌ తమను దూషించటాన్ని సెల్‌ఫోనలో రికార్డు చేసినట్లు చెప్పాను. ఆ తర్వాత బస్సెక్కిన తనను దారి పొడవునా దూషించారనీ, తాము తిట్టడాన్ని రికార్డు చేసి ఎవరికైన వినిపిస్తే ఈరోడ్‌కు ప్రాణాలతో వెళ్లలేరని డ్రైవర్‌, క్లీనర్‌ బెదరించారని విజయకుమారి డిఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈరోడ్‌ వీరప్పనసత్తిరం కొత్తకార తోట్టమ్‌ ప్రాంతానికి చెందిన విజయ కుమారి చెన్నై వలసరవాకంలో నివశిస్తూ టీవీ సీరియల్స్‌, సినిమాల్లో నటిస్తున్నారు. త్వరలో విడుదల కానున్న, యువనటుడు జై హీరోగా నటించిన ‘పుగళ్‌' చ్రితంలోనూ ఆమె నటించారు.

English summary
Bus driver's abusive behavior on actress Vijaya Kumari.
Please Wait while comments are loading...