దశావతారం దర్శంచనున్న బుష్...

By Staff

Kamal Hassan
కమల్ హాసన్ పది రకరకాల గెటప్స్ లో కనిపించబోతున్న 'దశావతారం' రోజుకో సంచలనంతో వార్తల్లో నిలుస్తోంది. ఆస్కార్ రవిచంద్రన్..కె.యస్ .రవికుమార్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి. ఈ నెల పదమూడున ప్రపంచవాప్తంగా రిలీజుకాబోతున్నఈ చిత్రం ప్రివ్యూని తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి చూసి ప్రశంసించారు.

ఇక ఈ రోజు ఆ చిత్రాన్ని అమెరికా ప్రెసిడెంట్ జార్జి బుష్ చూడబోతున్నారని నిర్మాత రవిచంద్రన్ మీడియాకు తెలియచేసారు. సినిమాలో కమల్ బుష్ గెటప్ లో కనిపిస్తారు. తన రూపాన్ని అనుకరిస్తూ వచ్చే ఆ సన్నివేశాలకు బుష్ ఎట్లా స్పందిస్తారో ఆని ఆసక్తితో దర్శక,నిర్మాతలు ఉన్నారని తెలుస్తోంది. దాంతో ఈ తరహా లో ఒక దక్షిణాది సినిమాను భారీ ఎత్తున ప్రమోట్ చేయటం మొదటి సారి అవుతుంది. మరో ప్రక్క న్యాయపరమైన చిరాకులలో ఉన్న ఈ సినిమాని ఎట్టి పరిస్ధితుల్లో అనుకున్నట్లుగా రిలీజుచెయ్యటానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక కమల్ తన తరువాత సినిమా 'మర్మయోగి' ఫ్రి ప్రొడక్షన్ పనుల్లో మునిగిపోయాడుట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X