రజినీ-శివ కాంబినేషన్.. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే..?

సూపర్ స్టార్ రజినీకాంత్ ఫుల్ స్పీడ్‌లో దూసుకుపోతున్నాడు. యంగ్ హీరోలతో పోటీపడుతూ వారి కంటే యమా జోరుగా సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు. అతి తక్కువ టైమ్‌లో షూటింగ్‌లను కంప్లీట్ చేసుకుని.. వేరే ప్రాజెక్ట్‌లోకి దూకేస్తున్నాడు. ఆరు పదల వయసును లెక్కచేయకుండా.. చకాచకా సినిమాలను చేసేస్తున్నాడు. ప్రస్తుతం సూపర్‌స్టార్.. దర్భార్ చిత్రంతో బిజీగా ఉన్నాడు.

ఏ ఆర్ మురుగుదాస్‌తో రజినీ ఫస్ట్ టైమ్ కలిసి సినిమా చేస్తోండటంతో అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. దానికి తగ్గట్టే రిలీజైన పోస్టర్స్, మోషన్ పోస్టర్ ఓ రేంజ్‌లో వైరల్ కాసాగాయి. ముంబై బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషిస్తున్నాడు. ఇది సంక్రాంతికి రిలీజ్ కానుండగా.. అంతలోపు తన తరువాతి ప్రాజెక్ట్‌ను లైన్లో పెట్టాడు.

Buzz Is That D Imman Is Music Director For Rajinikanth 168th Movie

అజిత్‌తో వరుస విజయాలను తీసిన దర్శకుడు శివతో రజినీ తన నెక్ట్స్ సినిమాను ఓకే చేశాడు. వీరం, వేదాలం, వివేగం, విశ్వాసం లాంటి బ్లాక్ బస్టర్‌లను తెరకెక్కించగా.. రజినీ కోసం ఓ పవర్‌ఫుల్ కథను సిద్దం చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్‌కు సంబంధించిన వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. డి ఇమ్మాన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడని వార్తలు వైరల్ అవుతున్నాయి. విశ్వాసం సినిమాకు ఇతడే సంగీతం అందించిన సంగతి తెలిసిందే. ఒకవేళ ఈ వార్తలే నిజమైతే.. రజినీ సినిమాకు ఎలాంటి సంగీతాన్ని అందిస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X