దేవుడి కరుణ వల్లే సాధ్యమైంది : నయనతార
చెన్నై : హాట్ హీరోయిన్ ..నయనతార ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో హవా చెలాయిస్తోంది. బాలకృష్ణ సరసన నటించిన 'శ్రీరామరాజ్యం'తో నటనకు ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నానని ప్రకటించింది. అయితే అనుకోని విధంగా మళ్లీ తెరపైకి వచ్చి సత్తా చాటుతోంది. ఈ ముద్గుగుమ్మకు అవకాశాలు ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం తమిళంలో చేతినిండా చిత్రాలున్నాయి నయన్‌కు.
ఈ విషయమై నయనతార మాట్లాడుతూ.. '' శ్రమించడం మాత్రమే నావంతు. ఫలితం దేవుడిచ్చేదే. సినిమా తప్పకుండా హిట్టవుతుందని ఎవరూ భరోసా ఇవ్వలేరు. ఎన్ని లెక్కలేసినా.. ప్రేక్షకులిచ్చే తీర్పు మారదు. నేను నటించిన ఐదు సినిమాలు ఈ ఏడాదిలో విడుదల కానున్నాయి. ఇదంతా దేవుడి కరుణ వల్లే సాధ్యమైందని భావిస్తున్నాను''అని చెప్పింది.
ఈ ఏడాదిలో తమిళంలో మూడు, తెలుగులో రెండు చిత్రాలు విడుదల కానున్నాయి. ఆసినిమాలు ఏమిటంటే... విష్ణువర్దన్ దర్శకత్వంలో 'తల' అజిత్‌కు జంటగా 'వలై', ఆర్య సరసన 'రాజారాణి', ఉదయనిధితో 'కదిర్‌వేల్ కాదలి' సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. మరో రెండు తెలుగు చిత్రాల్లోనూ నటిస్తోంది. హిందీ 'కహానీ' చిత్రం తెలుగు, తమిళ రీమేక్‌లో కూడా అమ్మడు నటిస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications












