నమితా నీకంత సీనుందా?
ఇప్పుడు నమిత, స్నేహ ఇద్దరూ లేడి అమితాబ్ విజయశాంతి రూటులో ప్రయాణం పెట్టుకున్నారు. భవాని ఐపియస్ పేరుతో ఆశయం చిత్రాన్ని రీమేక్ చేసే పనిలో స్నేహ బిజీగా ఉంటే..నమిత దేశద్రోహి అంటూ మరో విజయశాంతి మార్కు సినిమాని ఎత్తబోతోంది. ఇద్దరూ ఇంతలా పోటీ పడటానికి కారణం ఈ మధ్య కాలంలో ఎవరూ ఇలాంటి లేడీ పోలీస్ ఆపీసర్ పాత్ర చేయలేదని చెప్తున్నారు. అంతేగాక గొప్పగా విజయశాంతి చేసిన పాత్ర ఇది అని పబ్లిసిటీతో మరీ ముందుకు వస్తున్నారు.
అయితే వాళ్ళద్దరికీ అంత సీనుందా..విజయశాంతిలా పవర్ ఫుల్ గా నటించగలరా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయినా నమిత ని ఎలాంటి పాత్ర చేసినా ఆమె అందచందాలు, ఎక్సపోజింగ్ కోసమే ధియోటర్ కి వెళ్తాం అని కొందరు అభిమానులు మాట. అలాంటి విమర్శనే స్నేహ సైతం ఎదుర్కొంటోంది. ఆమె ఇన్నాళ్ళూ ప్యామిలి పాత్రలు చేసింది..ప్రక్కింటి అమ్మాయిలా ఉండే ఆమె ఇప్పుడు పోలీస్ అంటే ఆమెను ఎక్కడ చూడగలం అంటున్నారు.


Click it and Unblock the Notifications











