ఒంటరితనం కష్టమేనంటున్న విడాకుల హీరోయిన్
రీసెంట్ గా విడాకులు తీసుకున్న తమిళ హీరోయిన్ సోనీ అగర్వాల్ తాజాగా మీడియాను కలిసి ఒంటిరిగా ఉండటం కష్టమేనని అందులో ఒక వయస్సు వచ్చాక అంటూ నిట్టూరుస్తూ చెప్పుకొచ్చింది. ఆమె ప్రముఖ దర్శకుడు సెల్వ రాఘవన్ ని 2006 లో వివాహం చేసుకుని నాలుగేళ్ళ అనంతరం విడాకులు ఇచ్చి విడిపోయింది. వివాహానంతరం తెరకు దూరమైన ఈమె మళ్ళీ వెండితెరను అలరించటానికి పాత్రలు కమిటయ్యింది. అలాగే ఆమె చెన్నైలో తన అన్న, తల్లితో కలిసి ఉంటోంది. అక్కడ కలిసి ఓ మ్యాగజైన్ తో ఆమె పలు విషయాలు చర్చించింది కానీ విడాకలు తీసుకోవటానికి కారణం చెప్పటానికి నిరాకరించింది. అది ఓ కలగా భావిస్తున్నానని, మంచి కలా, చెడు కలా అన్నది తాము ఇద్దరికీ తెలుసని కవితాత్మకంగా చెప్పింది. తన కెరీర్ పెద్ద హిట్టైన సెవన్ బై జి బృందావన కాలనీ, తిరుత్తు పయిలే చిత్రాల తరహా పాత్రలు మళ్ళీ వస్తే అప్పటి సోనీ అగర్వాల్ లా తయరువుతానని నవ్వుతూ చెప్పింది. అలాగే తనకు తోడుగా తన కుటుంబం ఉంటున్నా.. అది కంటెన్యూ చేయటం ఇష్టం లేదని ఆమె అంది. అంటే త్వరలోనే సోనీ మళ్ళీ ఓ ఇంటిదవుతుందన్నమాట.


Click it and Unblock the Notifications











