నేను క్షేమమే.. రూమర్స్ నమ్మొద్దని హీరోయిన్

కొన్నాళ్లు అగ్రనటిగా కొనసాగిన ఆమె, అవకాశాల తగ్గటం, 2000లో తన తల్లి దేవిక చనిపోవటంతో ఒంటరిగా మిగిలిపోయింది. ఇదిలా ఉంటే కేరళ అలప్పూలాలోని ఓ క్యాన్సర్ ఆసుపత్రిలో కనక చికిత్స పొందుతున్నట్లు గత మూడు రోజుల కిందట వార్తలొచ్చాయి. అయితే తాను క్షేమంగానే ఉన్నానంటూ కనక చెన్నై రాజా అన్నామలైపురంలోని తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.
ఆమె మాట్లాడుతూ.. తాను క్షేమంగానే ఉన్నానని, తాను క్యాన్సర్‌కు గురైనట్లు వచ్చిన వార్తల్లో కూడా ఏమాత్రం నిజం లేదని తేల్చింది. ఎవరో ఉద్ధేశపూర్వకంగానే వదంతుల్ని వ్యాపింపజేస్తున్నట్లు ఆరోపించింది. కాబట్టి ఆమె క్షేమంగా ఉందని స్వయంగా చెప్పింది కాబట్టి ఈ రూమర్స్ ని ఎవరూ వ్యాప్తి చేయవద్దు.


Click it and Unblock the Notifications