twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేను క్షేమమే.. రూమర్స్ నమ్మొద్దని హీరోయిన్

    By Srikanya
    |

    Cancer rumours brought me alive in people's mind: Kanaka
    చెన్నై : తనకెలాంటి ఆరోగ్య సమస్యలు లేవని నటి కనక స్పష్టం చేశారు. తద్వారా కొన్ని రోజులుగా తనపై వస్తున్న ఆరోపణలకు తెరదించారు. అలనాటి నటి దేవిక కుమార్తెగా 1989లో 'కరగాట్టుక్కారన్‌' చిత్రంతో తెరంగేంట్రం చేసిన కనక, ఆ చిత్ర విజయంతో తారాపథంలోకి దూసుకెళ్లింది.

    కొన్నాళ్లు అగ్రనటిగా కొనసాగిన ఆమె, అవకాశాల తగ్గటం, 2000లో తన తల్లి దేవిక చనిపోవటంతో ఒంటరిగా మిగిలిపోయింది. ఇదిలా ఉంటే కేరళ అలప్పూలాలోని ఓ క్యాన్సర్‌ ఆసుపత్రిలో కనక చికిత్స పొందుతున్నట్లు గత మూడు రోజుల కిందట వార్తలొచ్చాయి. అయితే తాను క్షేమంగానే ఉన్నానంటూ కనక చెన్నై రాజా అన్నామలైపురంలోని తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.

    ఆమె మాట్లాడుతూ.. తాను క్షేమంగానే ఉన్నానని, తాను క్యాన్సర్‌కు గురైనట్లు వచ్చిన వార్తల్లో కూడా ఏమాత్రం నిజం లేదని తేల్చింది. ఎవరో ఉద్ధేశపూర్వకంగానే వదంతుల్ని వ్యాపింపజేస్తున్నట్లు ఆరోపించింది. కాబట్టి ఆమె క్షేమంగా ఉందని స్వయంగా చెప్పింది కాబట్టి ఈ రూమర్స్ ని ఎవరూ వ్యాప్తి చేయవద్దు.

    English summary
    “I have never had any cancer scare! These are just rumours. In fact, the last time I went to Alleppey was in 1992 when I was shooting a Malayalam film. I made a good friend there and I have been hoping to meet her ever since. Maybe I will now,” Kanaka said with a short laugh.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X