కెప్టెన్ విజయ్‌కాంత్‌కు తీవ్ర అనారోగ్యం.. చికిత్స కోసం 7న యూఎస్‌కు!
తమిళ, తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకొన్న కెప్టెన్ విజయ్ కాంత్ తీవ్ర అనారోగ్యంతో బాధపడతున్నారు. ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో పార్టీ వ్యవహారాలకు, సినీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. గతంలో పలు రకాల ట్రీట్‌మెంట్ చేయించుకొన్నప్పటికీ ఆయన ఆరోగ్యం కుదట పడలేదు. విజయ్‌కాంత్ ఎండీఎంకే పార్టీకి అధినేతగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

తాజాగా విజయ్ కాంత్ తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు. తాను అనారోగ్యానికి గురైంది నిజమే. ట్రీట్‌మెంట్ కోసం జూలై 7న అమెరికా వెళ్తున్నాను. నాకు వీడ్కోలు చెప్పేందుకు ఎవరూ ఎయిర్‌పోర్టుకు రావొద్దు అని అభిమానులను కోరారు. అలాగే ఎండీఎంకే పార్టీ అధికారికంగా ఓ ప్రకటనను కూడా విడుదల చేసింది.


Click it and Unblock the Notifications











