Vijaykanth Passed Away: విజయ్‌కాంత్ ఆస్తులు.. ఎన్ని కోట్ల సంపాదన ఉందో తెలుసా?
కోలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విజయ్ కాంత్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగా, నిర్మాతగానే కాకుండా రాజకీయ నాయకుడిగాను ఎంతో గొప్ప పేరు సంపాధించిన ఈయన.. ఈరోజు ఉదయం ఆస్పత్రిలో కన్నుమూశారు. ప్రస్తుతం 71 ఏళ్ల వయసు కల్గిన ఈయన ఐదు శతాబ్దాల పాటు 150కి పైగా చిత్రాల్లో నిటించి మెప్పించారు. గతకొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆయనకు తాజాగా కరోనా సోకడంతో ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. ఈక్రమంలోనే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం ప్రాణాలు కోల్పోయారు.
1952వ సంలత్సరం ఆగస్టు 25వ తేదీన పుట్టిన విజయ్ కాంత్ 1979లో సినిమా రంగంలో అడుగు పెట్టాడు. 2006 నుంచి రాజకీయల్లోకి వెళ్లాడు. ఇటు సినిమాలు చేస్తూ అటు రాజకీయాల్లో పాల్గొంటూ దమ్మున్న అధినేతగా పేరు తెచ్చుకున్నాడు. ఎవరూ ఊహించని స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సాధించాడు. గౌరవ మర్యాదలతో పాటు విజయ్ కాంత్ ఇప్పటి వరకు మొత్తం ఎన్ని వేల కోట్ల ఆస్తులు సంపాధించాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Recommended Video


2016లో విజయ్ కాంత్ ఉలుందరుపేట నుంచి పోటీ చేసినప్పుడు దాఖలు చేసిన అఫిడవిట్ లో ఆయన పేరుపై ఉన్న చరాల్సుతల విలువ 7.6 కోట్లు రూపాయలు అని తెలిపాడు. అలాగే ఆయన భార్య ప్రేమలతో పాటు ఇతర కుటుంబ సభ్యులు ఆస్తులు మొత్తం కలుపుకుని 14.79 కోట్ల రూపాయలు ఉన్నట్లుగా వివరించారు. అలాగే తన పేరుపై ఉన్న స్థిరాస్తుల విలువ రూ. 19.37 అని, తన భార్య పేరుపై రూ.17.42 కోట్ల ఆశస్తున్న ఉన్నాయని వెల్లడించారు. ఇలా మొత్తంగా విజయ్ కాంత్ స్థిరాస్తుల విలువ రూ.38.77 కోట్లుగా తెలుస్తోంది. ఆస్తులతో పాటు ఆయనకు రూ.14.72 కోట్లు అప్పులు ఉన్నాయని ఇవన్నీ పోను... రూ.53 కోట్లకు పైగా పూర్తి ఆస్తులు ఉన్నట్లు స్పష్టం చేశారు.
ఇక ఇతర సమాచారల మేరకు.. ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువు 50 నుంచి 60 కోట్లు వరకు ఉన్నట్లు తెలుస్తోంది. 1970లో 200 రూపాయల పారితోషికం తీసుకున్న ఈయన చనిపోయే వరకు 5 నుంచి 10 కోట్లు ఛార్జ్ చేసే వాళ్లు. హీరో మోటర్ కాప్, పెప్సి, పాండ్స్ వాటికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ.. ఒక్కో దానికి 2 కోట్ల వరకు రెమ్యునరేష్ పుచ్చుకునే వాళ్లు. ఈయన వద్ద ఉన్న కార్ల విలువే 3.50 కోట్లకు పైగా ఉంటుంది. 87 లక్షల రూపాయల విలువ చేసే ఆడి క్యూ7, 25 లక్షల విలువ చేసే టొయాటో న్నావో క్రిస్టా, 96 లక్షల విలువ చేసే బీఎండబ్ల్యూ ఎక్స్5, 1.2 కోట్లు విలువ చేసే మెర్సిడీస్ బెంజ్ ఎస్350, 36 లక్షల విలువ చేసే ఫోర్డ్ ఎండోవర్, 66 లక్షల విలువ చేసే వోల్వో ఎస్90, 27 లక్షల విలువ చేసే హ్యుండర్ సాంటా ఎఫ్ఈ కార్లు ఉన్నాయి.

అలాగే స్విమ్మింగ్ పూల్, గార్డెన్‌తో కూడిన విజయకాంత్‌సాలిగ్రామం మాన్షన్‌ను జూలై 2023లో రూ. 4.25 కోట్లకు వేలం వేశారు. విజయ్ కాంత్ రూ.5.52 కోట్లు రుణం తీసుకోగా.. దాన్ని రాబట్టుకునేందుకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఆ ఇంటిని వేలం వేసింది. విజయకాంత్, అతని కుటుంబ సభ్యులు ప్రస్తుతం కాంచీపురం జిల్లా మధురై మామండూరులో ఉన్నారు. మామండూరు ఆస్తి విలువ రూ. 4.25 కోట్లు వరుకు ఉంటుందట.


Click it and Unblock the Notifications











